
లోక్‌కళ్యాణ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
రాజంపేట : కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకా రం రూపొందించిన లోక్‌కళ్యాణ్‌మేళాను వీధి విక్రయదారులు సద్వినియోగం చేసుకోవాలని రాజంపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఎం స్వనిధి 2.0లో భాగంగా వీధి విక్రయదారులకు రుణ సదుపాయాలు, క్రెడిట్‌హామీ, వడ్డీ సబ్సిడీ లభి స్తాయన్నారు. మొదటి విడతలో రూ.15,000, రెండో విడతలో 25,000 మంజూరు అవుతాయన్నారు. యుపీఐ లింక్ రుపే క్రెడిట్ కార్డులు గరిష్టంగా రూ.30వేల వరకు అందజేస్తామన్నారు. కార్య క్రమంలో కార్మికశాఖ అధికారులు, కౌన్సిలర్లు, ఐసీడీఎస్ బ్యాంక్ ప్రతినిధులు, మెప్మా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
భూమి కేటాయింపునకు
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
– జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
రాయచోటి : ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీఎస్‌పీసీఎల్)కు లీజు ప్రాతిపదికన భూములు కేటాయింపునకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం విజయవాడలోని సీసీఎల్‌ఏ జయలక్ష్మీ ఆధ్వర్యంలో సంబంధిత జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో భూ కేటాయింపుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయచోటిలోని కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గాలివీడు సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన తూము కుంట, వెలిగల్లుకు సంబంధించిన లీజ్ ప్రక్రియ పనులను ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం లోగా నివేదికలను అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్స్‌రాజేంద్రన్, ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్ : ఉమ్మడి జిల్లా నుంచి డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అమరావతికి బయలుదేరి వెళ్లారు. ఉమ్మ డి జిల్లావ్యాప్తంగా 869 అభ్యర్థులు కాగా వారి కుటుంబ సభ్యులతో కలిసి 1666 మంది బయలు దేరి వెళ్లారు. వారి కోసం 43 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. 122 సిబ్బందితోపాటు 15 మంది పోలీసుల భద్రతతో కలెక్టరేట్ ప్రాంగణం నుంచి బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని డీఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. డీఎస్సీ అభ్యర్థులకు గురువారం నియామక పత్రాలు అందజేయనున్నారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లా డీఈఓలు షేక్ షంషుద్దీన్, సుబ్రమణ్యం, సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానందరాజు పాల్గొన్నారు.

లోక్‌కళ్యాణ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి