
అర్జీలకు సత్వర పరిష్కారం
– జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్
రాయచోటి : పీజీఆర్‌ఎస్ అర్జీలకు సత్వరం పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేస్తుందని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి సమస్యను, ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తుందన్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న బియాండ్ ఎస్‌ఎల్‌ఏ దరఖాస్తులపై వెంటనే చర్య లు తీసుకుని పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో జేసీ ఆదర్శరాజేంద్రన్, డీఆర్‌ఓ మధుసూదన్‌రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటిలకు
నియామక పత్రాలు
జిల్లా వెనుక బడిన తరగగతుల సంక్షేమ శాఖ ఆ ధ్వర్యంలో శిక్షణ పొంది, డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలకు నియామక పత్రాలు పొందిన వారిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమ వారం అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉ పాధ్యాయులుగా నియామకం కావడం వారి కష్టానికి ఫలితమన్నారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని వారికి కలెక్టర్ సూచించారు. స్కూల్ అసిస్టెంట్‌గా నియామకమైన ఎస్ మహమ్మద్, ఎస్జీటీగా నియామకమైన శివాజీలకు మెగా డీఎస్సీ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన సంక్షేమశాఖ అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.