
ఘనంగా సంప్రోక్షణ కార్యక్రమం
ప్రత్యేక అలంకరణలో ఉత్సవ మూర్తులు
బలి పీఠానికి సంప్రోక్షణ చేస్తున్న పండితులు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ధ్వజస్తంభం జీర్ణోద్ధరణ పనులు చేపట్టిన అనంతరం సంప్రోక్షణ కార్యక్రమాన్ని బుధవారం వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించారు. వేదపండితుడు రాజేష్ బట్టార్ ధ్వజస్తంభానికి, బలి పీఠానికి సంప్రోక్షణ, నివేదన, మంత్రపుష్పము నిర్వహించారు. టీటీడీ ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, టీటీడీ సివిల్ విభాగం ఏఈ అమరనాథ్‌రెడ్డి, ఆర్చకులు శ్రావణ్ కుమార్, వీణారాఘవచార్యులు, పవన్ కుమార్, మనోజ్ కుమార్ పాల్గొన్నారు.

ఘనంగా సంప్రోక్షణ కార్యక్రమం