
వైఎస్ఆర్ కడప జిల్లా: మండల పరిధిలోని పెద్దనపాడు గ్రామంలో ఇటీవల వినాయక నిమజ్జనం ఉరేగింపు వీడియో వైరల్ అయిన సంఘటనపై గ్రామంలోని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎర్రగుంట్ల పట్టణ సీఐ విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ పెద్దనపాడు గ్రామంలో వినాయక నిమజ్జనం సమయంలో వినాయకుడి విగ్రహం వెనుక రప్పారప్పా అని రాసిన దృశ్యం సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. దీంతో గ్రామ వీఆర్‌ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీడియోను చూసి అంకాల్‌రెడ్డి, అంకిరెడ్డి, అశోక్‌రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. కాగా మరి కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.