
ఘనంగా ఆసార్–ఏ–షరీఫ్
సిద్దవటం : మండల కేంద్రమైన సిద్దవటం పత్తుమియా మసీదులో బుధవారం రాత్రి ఆసార్–ఏ–షరీఫ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముతవల్లి సయ్యద్ అబ్దుల్ అజీస్ ఖాద్రి మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త వస్తు విశేషాలను తిలకించేందుకు ప్రజల ఎదుట ప్రదర్శించామన్నారు. అలాగే మహమ్మద్ ప్రవక్త కుమార్తె ఆయే షా, అల్లుడు హజరత్ అలీ, వారి మనువడు ఇమా మ్ హుస్సేన్‌కు సంబంధించిన వస్తు విశేషాలు, మహబూబ్ సుబహాని వస్తు విశేషాలు ప్రదర్శించామన్నారు. ముతవల్లి కుమారుడు నిజరే ఆలం ఖాద్రి, ఇమామ్ పీర్ బాషా ఖాద్రి పాల్గొన్నారు.