
రికార్డు ధర పలికిన గణేష్ లడ్డూ
రాయచోటి టౌన్: రాయచోటి పట్టణంలోని మదనపల్లె రోడ్డులో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్టూ రికార్డు ధర పలికింది. గురువారం రాత్రి వేలం పాట నిర్వహించగా రాయచోటి పట్టణానికి చెందిన మడితాటి శ్రీనివాస రెడ్డి ( కోడి శ్రీను) రూ.12లక్షలకు లడ్టూను దక్కించుకున్నారు.అనంతరం నిర్వాహకులు ఆయనను సన్మానించి లడ్డూను అందజేశారు.
తంబళ్లపల్లె: మండలంలోని కోసువారిపల్లెలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శుక్రవారం ముగిశాయి. అర్చకులు కృష్ణప్రసాద్‌భట్టార్,రమేష్‌లు మహాపూర్ణహుతి, కుంభప్రోక్షణ, పవిత్ర వితరణ, చక్రస్నానం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీదేవి,భూదేవి సమేత శ్రీవారిని పవిత్ర హారాలతో అలంకరించి పల్లకిలో ఊరేగించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఆలయ ఇన్స్‌పెక్టర్ దుష్యంత్‌కుమార్, నగేష్, ఆర్‌ఎంపి డాక్టర్ రమణారెడ్డి, సిద్దారెడ్ది ,బొట్టు శంకర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవరోజు శుక్రవారం ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు చతుష్ఠార్చన, ద్వారతోరణ, అనంత కళాపూజ, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠను అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4.00 నుంచి 6.00 గంటల వరకు నిత్య హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మయూరం కృష్ణమోహన్, త్రివిక్రమ్, ఇతర అర్చకులతోపాటు ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

రికార్డు ధర పలికిన గణేష్ లడ్డూ

రికార్డు ధర పలికిన గణేష్ లడ్డూ