
మదనపల్లెలో రంగమ్మత్త సందడి
మదనపల్లె రూరల్: రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా మెప్పించిన ప్రముఖ సినీనటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ శుక్రవారం మదనపల్లెలో సందడి చేశారు. పట్టణంలోని కదిరిరోడ్డు జడ్జిబంగళా పక్కన నూతనంగా ఏర్పాటుచేసిన సితార షాపింగ్ మాల్‌ను అభిమానుల కోలాహలం నడుమ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...వైవిధ్యభరితమైన డిజైన్లతో సంప్రదాయం, ఆధునికత కలబోసిన సితార షాపింగ్ మాల్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.ఈ షాపింగ్ మాల్ ప్రజల ఆదరాభిమానాలు పొంది మదనపల్లెలో ప్రథమస్థానంలో నిలవాలన్నారు. షాపింగ్‌మాల్ అధినేతలు.. నాగమల్లికార్జున, కే.ఆనంద్‌కుమార్, కే.సాయికిరణ్, .బి.శివకుమార్ మాట్లాడుతూ...ఫ్యాషన్ హల్‌చల్..సితారకి చల్ చల్ అనేలా పట్టణ ప్రజలందరి అభిరుచులకు తగిన విధంగా షాపింగ్ మాల్‌ను ఏర్పాటుచేశామన్నారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ అనంతరం అనసూయ డ్యాన్స్ చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. ప్రారంభోత్సవం సందర్భంగా షాపింగ్ మాల్‌ను సందర్శించిన వారిలో ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్‌అహ్మద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్.దేశాయ్‌తిప్పారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మనూజారెడ్డి, వైఎస్సార్ సీపీ చేనేతవిభాగం జిల్లా అధ్యక్షులు శీలంరమేష్, మునిశేఖర్, నాయకులు రాటకొండ బాబురెడ్డి, శ్రీరామ్‌చినబాబు, జంగాల శివరాం, రాజ్‌భవన్ రాజా తదితరులు పాల్గొన్నారు.