కె జయమ్మ,
సంబేపల్లి
రాజశేఖర్, చిట్వేలి
శివ నారాయణ, చిట్వేలి
షఫీవుల్లా,
నందలూరు
రాయచోటి: ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నతులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రవాణ, క్రీడలు, యువజనశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని అజయ్ రెసిడెన్సీ హాలులో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు ప్రధాన అతిథులుగా హాజరయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులలో ఉన్నత విలువలు, విజ్ఞానం నూరిపోసి భవిష్యత్తు తరాలను సమాజానికి దిశానిర్దేశం చేసేలా తీర్చిదిద్దాలన్నారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్‌ను రెండు శాతం నుంచి మూడుశాతానికి పెంచినట్లు తెలిపారు. ఈ క్రమంలో 421 పోస్టులను స్పోర్ట్స్ కోటా క్రింద భర్తీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.
● జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం ప్రతి ఒక్కరికీ ప్రేరణ అవుతుందన్నారు. జిల్లాలో అత్యుత్తమ సేవలు అందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది మంచి పేరు తెచ్చుకున్న 56 మంది గురువులను సన్మానించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గురువుల స్థానం గొప్పదన్నారు. ఉత్తమ పౌరులు తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. అనంతరం అతిథులు 56 మంది ఉపాధ్యాయులను పేరుపేరున అత్మీయంగా పలుకరిస్తూ సన్మానం చేశారు. అంతకుముందు వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఈఓ కె సుబ్రమణ్యం, డిప్యూటీ డీఈఓలు పాల్గొన్నారు.
నాగలక్ష్మి,
అంగళ్లు
రమేష్‌కుమార్, లక్కిరెడ్డిపల్లె
అన్నమయ్య జిల్లాకు చెందిన నిర్మల కుమారిని
సన్మానిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు నిర్మల కుమారి, వెంకటేశ్వర ప్రసాద్‌లను పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలు సన్మానించారు. –విజయవాడ
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
56 మందికి ఉత్తమ ఉపాధ్యాయపురస్కారాలు ప్రదానం
విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలి
విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలి
విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలి
విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలి
విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలి
విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలి
విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలి
విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలి