
ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం
ప్రమోద్ కుమార్,
అనంతపురం (5 వికెట్లు)
శివ కేశవ, కడప
(43 పరుగులు)
నాగ చాతుర్య, కడప
(53 పరుగులు)
ప్రశాంత్, అనంతపురం
(90 పరుగులు)
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు బుధవారం ప్రారంభమయ్యాయి. వైఎస్‌ఆర్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కడప జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. ఆ జట్టులోని నాగ చాతుర్య 53 పరుగులు, విజయ్ రామిరెడ్డి 62 పరుగులు, శివ కేశవ 43 పరుగులు, అయూబ్ 36 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని కనిష్ 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో...
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో నెల్లూరు–అనంతపురం జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 44.4 ఓవర్లకు 239 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని పవన్ రిత్విక్ 50 పరుగులు, మాధవ్ 56 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రమోద్ కుమార్ చక్కటి లైనప్‌తో బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. భార్గవ్ 2 వికెట్లు, ప్రవీణ్‌కుమార్ సాయి 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 36 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రశాంత్ 90 పరుగులు, అర్జున్ టెండూల్కర్ 52 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని నారాయణ 2 వికెట్లు, మాధవ్ 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.

ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం

ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం

ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం