
యూరియా స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన జేసీ
రాయచోటి : రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులలో ఉన్న యూరియా స్టాక్ పాయింట్లను జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆకస్మిక తనిఖీ చేశారు. బధవారం రాయచోటి పరిధిలోని చెన్నముక్కపల్లి–2 లోని రైతు సేవాకేంద్రం, పట్టణంలోని ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులను బుధవారం పరిశీలించారు. యూరియా స్టాక్‌ను పరిశీలించి వ్యవసాయ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్‌తో కలిసి రాయచోటిలోని జాఫర్ సాబ్ ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసి ఆ షాపు యాజమాన్యం నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించారు.
స్వామిత్ర సర్వే పరిశీలన...
రూరల్ మండలం, దిగువ అబ్బవరం గ్రామంలో జరుగుతున్న స్వామిత్ర సర్వే కార్యక్రమాన్ని జేసీ పరిశీలించారు. మండల సర్వేయర్, పంచాయతీ సెక్రటరీలకు తగు సూచనలు చేశారు.