
విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు
సిద్దవటం : మండలంలోని ఎస్టీ కాలనీకి చెందిన సు భాషిణి ఈ నెల 2వ తేదీ నుంచి కనిపించలేదని బంధువు గుర్రమ్మ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. గుర్రమ్మ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఎస్టీ కాలనీకి చెందిన సుభాషిణి టక్కోలు జెడ్పీ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ నెల 2వతేదీ పాఠశాల ముగిసిన తరువాత ఆమె ఇంటికి రాలేదని బంధువులు తెలిపారు. తమ బంధువు కు బాగాలేదంటూ నమ్మించి వరుసకు మేనమా మ అయిన వ్యక్తి ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లాడ ని వారు తెలిపారు. బాలిక బంధువు గుర్రమ్మ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
భార్యాభర్తలపై దాడి
మదనపల్లె రూరల్ : స్థల వివాదం, వ్యక్తిగత కక్షలతో భార్యాభర్తలపై దాడిచేసిన ఘటన మంగళవారం కురబలకోట మండలంలో జరిగింది. నందిరెడ్డిగారిపల్లెకు చెందిన భార్యాభర్తలు అబ్దుల్‌బాషా(27), అమ్మాజాన్(22)లపై అదే ప్రాంతానికి చెందిన మహబూబ్‌బాషా, చాంద్‌బాషా, నన్నీబీలు దాడికి పాల్పడ్డారు. దాడిలో భార్యాభర్తలు గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
మున్సిపల్ ఉద్యోగిపై
దాడి కేసులో ఇద్దరి అరెస్ట్
మదనపల్లె రూరల్ : మున్సిపల్ ఫిట్టర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌పై దాడి చేసిన సంఘటనలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ వెంకట శివకుమార్ తెలిపారు. కుమారపురానికి చెందిన రాజా(46), నిమ్మనపల్లె మండలం బండ్లపై పంచాయతీ భూమలగడ్డకు చెందిన ప్రదీప్(30)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసులో మరో నిందితుడైన రవిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు.
విద్యుత్ స్తంభాన్ని
ఢీకొట్టిన లారీ
రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి–మదనపల్లె రోడ్డులో విద్యుత్ స్తంభాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో పెనుప్రమాదం తప్పింది. విద్యుత్ శాఖ అధికారులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె రోడ్డు మార్గంలో ఏపీ39యువై 4126 నెంబర్ లారీ అతివేగంగా వచ్చి 11 కెవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి సమీపంలోని ఇంటి ముందు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో పోల్ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయింది. స్పందించిన విద్యుత్తు సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరఫరా నిలిపివేశారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చేశారు. సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు