ప్రభుత్వ స్థలం.. పరాధీనం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్థలం.. పరాధీనం

Aug 6 2025 7:44 AM | Updated on Aug 6 2025 7:44 AM

ప్రభు

ప్రభుత్వ స్థలం.. పరాధీనం

టీడీపీ నాయకుడి భూ బాగోతం

క్రీడామైదానానికి కేటాయించిన భూమి ఆక్రమణ

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినాఫలితం శూన్యం

టాస్క్‌ఫోర్స్‌: అన్నమయ్యజిల్లా రాజంపేటలో అధికారం అండగా టీడీపీ శ్రేణులు భూ ఆక్రమణలకు తెరతీస్తున్నారు. తమను ఎవరు ఏమి చేయలేరన్న ధైర్యం..అడిగేవారు లేరన్న ధీమాతో టీడీపీ నాయకులు అడ్డదారులకు రాచబాట వేసుకొని వెళుతున్నారు. ఇప్పటికే భూములు, స్థలాలు, మద్యం, ఇసుక, మట్టి వంటివాటిని దోచేస్తున్నారు. రాజంపేట పరిధిలో భూములు కోట్లాది రూపాయిలు విలువ చేస్తున్న తరుణంలో తెలుగు తమ్ముళ్లు సులువుగా కోటీశ్వర్లు అయ్యేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. ఖాళీ జాగా వేసేయ్‌ పాగా అన్నచందంగా భూకబ్జాల పర్వం కొనసాగుతోది. పేద ప్రజలు ఏమాత్రం విలువ చేయని ప్రాంతంలో రెండు సెంట్ల ప్రభుత్వ స్థలంలో చిన్నపాటి గుడిసె వేసుకున్నా అధికారులు ఆగమేఘాల మీద చర్యలకు ఉపక్రమిస్తారు. అయితే రాజంపేట మండలంలో కూటమి నాయకులు కోట్లాది రూపాయిల విలువ చేసే భూములు, స్థలాలు కబ్జాచేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలావుంటే.. రాజంపేట మండలంలోని మిట్టమీదపల్లె పొలం సర్వే నంబర్‌ 1066లో చుండువారిపల్లెలో ఉన్న ఎస్టీ ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన నాలుగు ఎకరాల క్రీడామైదానాన్ని మండలంలోని అదే గ్రామానికి చెందిన చుండు సుధీర్‌ దర్జాగా ఆక్రమించుకున్నాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్‌ విలువ ప్రకారం నాలుగు కోట్ల రూపాయిల వరకు ఉన్నట్లు ఆ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు చెబుతున్నారు. ఆమేరకు నాలుగు ఎరకాల స్థలం దాదాపు 16 కోట్ల రూపాయిల విలువ చేస్తుంది. ఆక్రమించుకున్న భూమిలో సుధీర్‌ భవనం నిర్మించుకోవడంతో పాటు పలు రకాల పండ్ల చెట్లను కూడా దర్జాగా సాగు చేసుకుంటున్నాడు. ఎస్టీ విద్యార్థుల సౌకర్యార్థం కేటాయించిన స్థలం కావడం వల్లే తనను ఎవరు అడగరన్న ధీమాతో సుధీర్‌ భూ ఆక్రమణకు తెగబడినట్లు తెలుస్తోంది. క్రీడామైదానం కోసం కేటాయించిన స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకున్న విషయాన్ని జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూసేందుకు సాహసం చేయడం లేదంటే అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చుండు సుధీర్‌ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గన్నే సుబ్బనరసయ్యనాయుడుకు ముఖ్య అనుచరుడిగా ఉంటుండటం వల్ల అధికారులకు కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులకు ఫిర్యాదు

మిట్టమీదపల్లె పొలం సర్వే నంబర్‌లోని 1066 సర్వే నెంబర్‌లో నాలుగు ఎకరాల భూమిని చుండు సుధీర్‌ కబ్జా చేసినట్లు అదే పంచాయితీలోని కొమ్మివారిపల్లె అరుంధతివాడకు చెందిన గొంటు మణి తెలిపాడు. ఈ ఏడాది మార్చి నెలలో రెండుమార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సుధీర్‌ భూకబ్జాపై ఫిర్యాదు చేశానని, దాదాపు ఐదు నెలలు అయినా ఏ అధికారి కూడా ఈ భూమిని కనీసం చూడను కూడా లేదని మణి ఆరోపించాడు.

ప్రభుత్వ స్థలం.. పరాధీనం 1
1/2

ప్రభుత్వ స్థలం.. పరాధీనం

ప్రభుత్వ స్థలం.. పరాధీనం 2
2/2

ప్రభుత్వ స్థలం.. పరాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement