
రాష్ట్ర స్థాయి పోటీలకు భారతి విద్యార్థి ఎంపిక
కమలాపురం : మండలంలోని నల్లలింగాయపల్లెలోని డీఏవీ భారతి పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎంవీ.నరేష్ రాష్ట్ర స్థాయి జావెలిన్ త్రో పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్‌కుమార్ తెలిపారు. విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ భారతి సిమెంట్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని డీఏవీ భారతి పాఠశాల విద్యార్థులు ఈ నెల 3న ప్రొద్దుటూరు మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొన్నారు. జావెలిన్‌త్రోలో నరేష్ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ నెల 9వ తేదీ నుంచి 11వతేదీ వరకూ బాపట్లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో నరేష్ పాల్గొంటారని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా పరిశ్రమ సీఎంఓ సాయిరమేష్, హెచ్‌ఆర్ హెడ్ గోపాల్‌రెడ్డి, ఐఆర్‌అండ్‌పీఆర్ హెచ్.భార్గవ్ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి విద్యార్థితో పాటు పీడీ రామచంద్రను అభినందించారు.