
అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం
కడప కార్పొరేషన్ : జిల్లాలోని అన్ని పంచాయితీలలో అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా పంచాయితీ అధికారి జి.రాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. విక్రయ ఒప్పందం లేదా హక్కు పత్రంతో ఉన్న అనధికార లే అవుట్‌కు 90 రోజుల్లో వ్యక్తిగతంగా రెగ్యులైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్)కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆగష్టు 4వ తేదీ నుంచి ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్ ఓపెన్‌లో ఉంటుందన్నారు. ఓపెన్ స్పేస్ చార్జీలు 45 రోజుల్లో పూర్తిగా చెల్లిస్తే పది శాతం, 90 రోజుల్లో చెల్లిస్తే 5 శాతం పెనాల్టీ తగ్గింపు ఉంటుందన్నారు. ఇప్పటికే ఐపీఎల్‌పీ ఆమోదింపబడిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని, కొత్తగా వచ్చిన దరఖాస్తులను తక్షణం పరిష్కరించడం జరుగుతుందన్నారు. వివరాలకు 9849966639 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.