ఉప పోరు.. ప్రచార జోరు | - | Sakshi
Sakshi News home page

ఉప పోరు.. ప్రచార జోరు

Aug 6 2025 7:44 AM | Updated on Aug 6 2025 7:44 AM

ఉప పో

ఉప పోరు.. ప్రచార జోరు

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రచారం జోరందుకుంది. ఆ పార్టీ నాయకులు గ్రామాల్లోకి ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం మండల పరిధిలోని సాలాబాదు, గంగపేరూరు గ్రామాలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, బద్వేల్‌ ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, కడప మేయర్‌ సురేష్‌ బాబు, కోడురు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్‌ రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ రామగోవిందరెడ్డిలు అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తో కలిసి జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి, ఇరగంరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సును ఏర్పాటు చేస్తామని చెప్పి, తీరా అధికారం చేజిక్కించుకున్న తరువాత అదిగో.. ఇదిగో..అంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఇరగంరెడ్డి గెలిపు ఒక గుణపాఠం కావాలన్నారు.

● రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ..అందరికి అనువుగా ఉండే రాజధాని అమరావతి అంటూ..కొద్ది పాటి వర్షాలకే నీట మునిగిపోయే ప్రాంతాన్ని రాజధానిగా చేసి, ప్రజలకు అందివ్వాల్సిన సంక్షేమ పథకాల నిధులన్నీ రాజధానికి దోచి పెడుతున్న సీఎం చంద్రబాబుకు ఈ ఎన్నిక చెంపపెట్టుకావాలన్నారు. – – బద్వేల్‌ ఎమ్మెల్యే దాసరి సుధా మాట్లాడుతూ..ఉన్నత చదువు చదివిన యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న మోసపూరిత ప్రభుత్వానికి సుబ్బారెడ్డి గెలుపు గుణపాఠం కావాలన్నారు.

● మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు రూ. 4 వేల పెన్షన్‌ ఇస్తానన్న సీఎం చంద్రబాబు హామీ నెరవేర్చకపోవడంతో బీసీల ఆశలు అవిరయ్యాయి. ఇలాంటి సాధ్యం కాని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఎంతో కాలం ఉండదన్న నిజం ఈ ఉప ఎన్నికతో నిరుపించాలన్నారు.

● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ..చేనేత కార్మికులకు ఉచితంగా ఇస్తానన్న 200 యూనిట్ల కరెంటును కూడా ఇంతవరకు అమలు చేయకపోవడం కూటమి ప్రభుత్వం చేతకాని పాలనకు నిదర్శనం, ఇలాంటి అసమర్ధత ప్రభుత్వానికి ఓటు అనే అయుధంతో బుద్ధి చెప్పాలన్నారు.

● కడప మేయర్‌ సురేష్‌ బాబు మాట్లాడుతూ.. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రహ్మాణులకు ఇస్తానన్న రూ. 25 వేల గౌరవ వేతనం ఇస్తామంటూ ఆశ కల్పిస్తున్నారన్నారు. అలాంటి ఆశలను చూపే వారికి మనం ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.

● కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు ఇస్తానన్న 34 శాతం రిజర్వేషన్‌ కూడా ఇవ్వకుండా కూటమి నేతలు మోసాలు చేస్తున్నారు. వారికి బీసీల విలువ తెలియాలంటే ఈ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి ఓటు వేయాలన్నారు.

● ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ..మెగా డీఎస్సీ అని కేవలం 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసి, మెగా డీఎస్సీ అని కోతలకు పోతున్న ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ఏడాదికే 2 లక్షల 50 వేల ఉద్యోగాల ఇచ్చిన సంగతిని గుర్తు చేయాలంటే ఈ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలన్నారు

● రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అది వైఎస్సార్‌సీపీకే సాధ్యమన్నారు. కానీ కూటమి నాయకులు హామీలను చిత్తశుద్ధితో అమలు చేయడం లేదన్నారు. అలాంటి వారికి ప్రజల చిత్తశుద్ది అంటే ఏమిటో ఈ ఉప ఎన్నికల్లో రుచి చూపాలన్నారు.

● జెడ్పీ చైర్మన్‌ రామగోవిందరెడ్డి మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు హామీలు..మోసాలకు నిలయాలని, అలాంటి మోసాలు చేసిన కూటమి ప్రభుత్వానికి ఉప ఎన్నికలో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షురాలు అజంతమ్మ, రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, ఒంటిమిట్ట మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాజంపేట నియోజకవర్గ యూత్‌ వింగ్‌ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్‌ రెడ్డి, సాలాబాదు సర్పంచ్‌ స్వర్ణలత, ఉప సర్పంచ్‌ వెంకటేశ్వరరెడ్డి, గంగపేరూరు సర్పంచ్‌ కూండ్ల బుజ్జమ్మ, వైఎస్సార్‌సీపీ ఒంటిమిట్ట మండల పంచాయతీ రాజ్‌ అధ్యక్షులు మేరువ శివనారాయణ వైఎస్సార్‌సీపీ నాయకులు మేకపాటి నందకిశోర్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ముమ్మడి వెంకటకృష్ణారెడ్డి, లంకారామిరెడ్డి, గంగిరెడ్డి పాల్గొన్నారు.

సాక్షి రాయచోటి: ఎన్నికలు జరుగుతున్న రెండు మండలాల్లో ఎన్నో ఏళ్లుగా ఏకఛక్రాదిపత్యమే కొనసాగుతోంది. ఆది నుంచి కూడా వైఎస్‌ కుటుంబానికి కంచుకోటలుగా ఉండడమేగాక, ఆ కుటుంబం బలపరిచిన అభ్యర్థులే గెలుపుబావుటా ఎగురవేస్తూ వస్తున్నారు. అభ్యర్థి ఎవరైనా కులమతాలు, వర్గాలు బేధం చూడకుండా ఓటర్లు గెలుపును ఏకపక్షం చేస్తూ వస్తున్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాం నుంచి ఇప్పటివరకు 25 ఏళ్ల చరిత్రను పరిశీలించినా పులివెందులతోపాటు ఒంటిమిట్టలోనూ కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే విజయఢంకామోగిస్తూ వస్తున్నారు.

టీడీపీ కుట్రలు...కుయుక్తులు

వైఎస్సార్‌ జిల్లాలోని ఒంటిమిట్ట మండలానికి సంబంధించి జెడ్పీ చైర్మన్‌గా ఆకేపాటి అమర్‌నాథరెడ్డి కొనసాగుతూ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట జెడ్పీటీసీతోపాటు జెడ్పీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయడంతో ఒంటిమిట్ట ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే పులివెందులకు సంబంధించి గతంలో జెడ్పీటీసీగా పనిచేస్తున్న మహేశ్వర్‌రెడ్డి మృతి చెందడంతో అక్కడ కూడా ఎన్నిక తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో రెండుచోట్ల బలంగా ఉన్న వైఎస్సార్‌ సీపీని ఢీ కొట్టలేక అధికారంలో ఉన్న కూటమి సర్కార్‌ కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులతోపాటు దాడులకు తెగబడుతోంది. పోలీసుల ద్వారా బైండోవర్‌ పేరుతో వైఎస్సార్‌ సీపీ నేతలను భయపెట్టడం ఒక ఎత్తయితే, మరోవైపు వైఎస్సార్‌ సీపీ నాయకులపై ప్రత్యక్ష దాడులకు దిగుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో కూడా అలజడులు సృష్టించి క్యాడర్‌ను ఆందోళనలకు గురి చేయాలని చూస్తున్నారు. ఏదో ఒక రకంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులను భయబ్రాంతులకుగురి చేయాలన్న సంకల్పంతో టీడీపీ పులివెందులలో వికృత చేష్టలకు తెర తీయడంపై పలువురు రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీ కీలక నేతల ప్రచారం

జిల్లాలోని పులివెందుల మండలంలో వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డికి మద్దతుగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఫ్రచారం నిర్వహిస్తుండడంతో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు ఒంటిమిట్ట మండలానికి సంబంధించి వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, కడప నగర మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ రామగోవిందరెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తుండడంతో మరోవైపు టీడీపీ కూడా ప్రచారం చేస్తోంది.

వేడెక్కిన రాజకీయం

జిల్లాలో రెండు జెడ్పీటీసీలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండడంతో రాజకీయం వేడెక్కింది. ఈ ఎన్నికలను టీడీపీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుని అధికార బలాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. ఇన్‌చార్జి మంత్రి సవిత పులివెందులలో కూర్చొని మంత్రాంగం నడిపిస్తుండగా, ఒంటిమిట్టలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఎక్కడికక్కడ పావులు కదుపుతున్నారు. జెడ్పీటీసీ లాంటి చిన్నపాటి ఎన్నికలను కూడా అధికారంలోకి కూటమి సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరువు కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగాన్ని వినియోగించడం మొదలుకొని ఏదో రకంగా మంత్రులు అక్కడే మకాం వేసి ప్రత్యేకంగా కృషి చేస్తున్న తీరును చూసి పలువురు విస్మయం చేస్తున్నారు.

ఒంటిమిట్ట టీడీపీ అభ్యర్థిగా ముద్దు కృష్ణారెడ్డి

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ అభ్యర్థిగా అడ్డలూరు ముద్దు కృష్ణారెడ్డి పేరును మంగళవారం అధిష్టానం ప్రకటించింది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు కడప జెడ్పీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌ మోహన్‌ రాజుతో కలిసి ముద్దుకృష్ణారెడ్డి సీఈఓ ఓబులమ్మ చేతులు మీదుగా బీ–ఫారం అందుకున్నారు.

కడప సెవెన్‌రోడ్స్‌: ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబందించిన నామినేషన్ల ఉపంసహరణ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. పులివెందుల స్థానానికి 12 మంది, ఒంటిమిట్ట స్థానానికి 21 మంది తొలుత నామినేషన్లు సమర్పించారు. ఉపసంహరణల అనంతరం ఒంటిమిట్టలో 11 మంది, పులివెందులలో 11 మంది బరిలో ఉన్నారు.

ఒంటిమిట్టలో..

ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి (వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ), పూల విజయభాస్కర్‌ (కాంగ్రెస్‌), ముద్దుకృష్ణారెడ్డి (తెలుగుదేశం పార్టీ), అరిగేల సౌమిత్రి చంద్రనాథ్‌, కోనేటి హరి వెంకట రమణ, గుండు మల్లికార్జునరెడ్డి, టక్కోలి శివారెడ్డి, నడివీధి సుధాకర్‌, వై.మధుమూర్తి, మామిళ్ల ఈశ్వరయ్య, వెంకటేశ్‌ నంద్యాల స్వతంత్రులుగా పోటీలో ఉన్నారు.

పులివెందులలో..

పులివెందుల స్థానానికి తుమ్మల హేమంత్‌రెడ్డి (వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ), మారెడ్డి లతారెడ్డి (తెలుగుదేశం పార్టీ) మొయిళ్ల శివ కల్యాణ్‌రెడ్డి (కాంగ్రెస్‌), అంకిరెడ్డి సురేష్‌కుమార్‌రెడ్డి, తుమ్మనూరు అనిల్‌కుమార్‌రెడ్డి, నాగేళ్ల సాంబశివారెడ్డి, భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, మారుజోళ్ల గజేంద్రనాథ్‌రెడ్డి, మారెడ్డి జయభారత్‌రెడ్డి, ముద్దిగారి వెంగళరెడ్డి, యాదటి సునీల్‌యాదవ్‌ స్వతంత్య్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు.

తిరుగులేని ఆధిక్యం

ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

ఆది నుంచి వైఎస్‌ కుటుంబం బలపరిచిన వారిదే గెలుపు

పులివెందుల, ఒంటిమిట్టల్లోనూ 25 ఏళ్ల చరిత్రలో విజయం ఏకపక్షం

అధికారం అండగా..కుట్రలకు తెర తీస్తున్న టీడీపీ

నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ ముగియడంతో వేడెక్కిన రాజకీయం

వైఎస్సార్‌ కడపజిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే ప్రతిసారి తిరుగులేని ఆధిక్యత వైఎస్సార్‌ కుటుంబం బలపరిచిన అభ్యర్థులదే కనిపిస్తోంది. దాదాపు 25 ఏళ్లలో పలు దఫా లుగా జరిగినా ప్రతి ఎన్నికలోనూ అటు కాంగ్రెస్‌ (వైఎస్సార్‌ హయాంలో), తర్వాత క్రమంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తూ వస్తున్నారు. ఎప్పుడు చూసినా ప్రజలు కూడా నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న వైఎస్సార్‌ కుటుంబం వైపే మొగ్గుచూపుతున్నారు. వర్గాలు, వైషమ్యాలు, రాజకీయాలను పక్కనపెట్టి ఓటర్లు కూడా వైఎస్సార్‌ కుటుంబం ఎవరికి మద్దతు ఇస్తే వారినే గెలిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు.

ఒంటమిట్ట బరిలో 11 మంది

పులివెందులలో 11 మంది

ఉప పోరు.. ప్రచార జోరు 1
1/4

ఉప పోరు.. ప్రచార జోరు

ఉప పోరు.. ప్రచార జోరు 2
2/4

ఉప పోరు.. ప్రచార జోరు

ఉప పోరు.. ప్రచార జోరు 3
3/4

ఉప పోరు.. ప్రచార జోరు

ఉప పోరు.. ప్రచార జోరు 4
4/4

ఉప పోరు.. ప్రచార జోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement