● నేలకొరుగుతున్న భారీ వృక్షాలు
● అక్రమంగా తమిళనాడుకు తరలిపోతున్న వృక్షసంపద
● పట్టించుకోని అధికారులు
● వాల్టాచట్టం అమలు ఏది?
జిల్లాలో ఎక్కడా వాల్టా చట్టం అమలు కావడం లేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ చట్టం ప్రకారం చెట్లను నరికి వేయడానికి ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఏ ప్రాంతానికై నా తరలించాలంటే అటవీశాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రస్తుతం చెట్లను కోసేయడానికి ఎటువంటి అఽనుమతులు తీసుకోక పోవడం గమనార్హం. ప్రతిరోజు ఏక్కువ సంఖ్యలో లారీలు, ట్రాక్టర్ల ద్వారా వృక్షసంపద కొయ్యమిల్లులతో పాటు తమిళనాడు రాష్ట్రాలకు తరలి వెళుతోంది. ప్రతి ఒక్కరూ మొక్కలునాటి కాపాడాలని ప్రభుత్వం ప్రచారం చేస్తూన్నా ఇక్కడ ఆమాటలు ఆచరణలో పెట్టకపోవడం గమనార్హం. చర్యలు తీసుకొవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో వాల్టా చట్టం అవులు ప్రశ్నార్థకంగా మారింది.ప్రకృతి సహజసిద్దమైన వనాలు, చెట్లను సంరక్షించాల్సిన అధికారులు వాటిని అక్రమంగా నరికి వేసి తరలించుకు పోతున్నా చోద్యం చూస్తూ కాలం వెల్లదీస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
గుర్రంకొండ: జిల్లాలో వాల్టాచట్టం అమలు జాడ ఎక్కడా కనిపించడం లేదు. కొంతమంది భారీ వృక్షాలను నేల కూల్చేస్తున్నారు. యథేచ్చగా తమిళనాడు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. వాల్టా చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో వృక్ష సంపద రోజురోజుకు కనుమరుగైపోతోంది. ఓవైపు ప్రభుత్వం మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రచారం చేస్తున్నా మరోవైపు అక్రమార్కులు వృక్షాలను యథేచ్చగా నరికివేస్తూ వాటి ఉనికే లేకుండా చేస్తుండడం గమనార్హాం.
యథేచ్చగా వృక్షాలు నరికివేత
ఎక్కడపడితే అక్కడ వృక్షాలు నరికివేస్తున్నారు.ఉన్న చెట్లను సంరక్షించడంలో అటవీశాఖ, రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. గ్రావూల్లో అన్ని రకాల చెట్లు, వనాలు ఎంతో పురాతనమైనవి ఉన్నాయి. శతాబ్దాల క్రితం నాటిన వృక్షాలపై. వ్యాపారులు దృష్టి సారిస్తున్నారు. పట్టాలున్న పొలాల్లో కాకుండా పోరంబోకు స్థలాల్లో ఉన్న చెట్లను కుడా అక్రమంగా నరికివేస్తున్నారు. ఇవి ఇంటి వస్తువులు తయారుచేసే కలపతో పాటు ఇటుకల బట్టీలు కాల్చడంలో వినియోగించుకొంటున్నారు. చివరకు దేవుడి మాన్యం, వంకపోరంబోకు, చెరువుపోరంబోకు స్థలాల్లోని పురాతన చెట్లను అక్రమార్కులు వదలడం లేదు. లక్షలాది రుపాయలు విలువచేసే చెట్లను నరికివేసి సొమ్ము చేసుకొంటున్నారు.
● జిల్లాలోని వ్యాపారులే కాకుండా తమిళనాడు రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడ కొచ్చి చింతచెట్లతో పాటు సంద్ర, ఇతర వృక్షసంపదను అక్రమంగా తరలించుకుపోతున్నారు. బయట రాష్ట్రాల నుంచి కూలీలు జిల్లాకు తరలివచ్చి గ్రామాల్లో మకాం వేసి రాత్రి పగలు తేడాలేకుండా చెట్లను నరికేసి రాత్రిళ్లు లారీల్లో బయట రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. వందలసంవత్సరాల వయస్సున్న చింతచెట్లు, వేపచెట్లు సైతం కోతకు గురై కుమరుగవుతున్నాయి. ఒక్కో చెట్టు సుమారు రూ:20వేల నుంచి రూ: 40వేల వరకు ధర పలుకుతోంది. ఇంటివస్తువుల తయారీకి ఉపయోగ పడే చెట్లు లక్షలాది రుపాయలు ధరలు పలుకుతున్నాయి. దీంతో స్థానిక వ్యాపారులు, తమిళనాడుకు రాష్ట్రానికి చెందిన వ్యాపారులు కుమ్ముకై ్క ఇష్టానుసారం వృక్ష సంపదను ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు.
చట్టపరంగా చర్యలు తీసుకొంటాం
చెట్లను అక్రమంగా నరికివేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా ఎవరైనా వ్యాపారులు చెట్లను నరికివేసి తరలిస్తే కేసులు నమోదు చేస్తాం. చెట్లు నరికివేతపై ప్రజలు సమాచారం అందించి సహకరించాలి. వాల్టాచట్టం ఉల్లంఘించేవారిపై కేసులు నమోదు చేస్తాం. – సదాశివప్పనాయుడు, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, గుర్రంకొండ
అనుమతి తీసుకోవాలి
రెవెన్యూ అధికారులు చెట్లను నరికి వేయడానికి అనుమతి ఇచ్చినా వాటిని అటవీశాఖ అనుమతి లేనిదే బయట ప్రాంతాలకు తరలించకూడదు. ప్రతి వాహనం ఎక్కడి వెళుతుంది. వృక్షసంపద ఎక్కడికి, ఎందుకు తీసుకు వెళుతున్నారనే సమాచారం తమకు అందించి అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి. లేని పక్షంలో కేసులు నమోదు చేస్తాం. – రామ్మోహన్, ఫారెస్ట్‌బీట్ ఆఫీసర్, గుర్రంకొండ
వాల్టా.. ఉల్టా
వాల్టా.. ఉల్టా
వాల్టా.. ఉల్టా
వాల్టా.. ఉల్టా
వాల్టా.. ఉల్టా
వాల్టా.. ఉల్టా