
5న పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు
రాయచోటి టౌన్: రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 5వ తేదీ ఎలక్ట్రికల్ (ఈఈఈ), ఎలక్ట్రానిక్స్ (ఈసీఈ) కోర్సుల కోసం స్పాట్ అడ్మిషన్ల నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శివశంకర్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు నేరుగా సంబంధిత సర్టిఫికెట్లతో రావాలని కోరారు.అభ్యర్థులు 10వ తరగతి మార్కుల మెమో, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సరిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్‌లతో పాటు ఓసీ/ బీసీలు అయితే రూ.5800, ఎస్సీ, ఎస్టీలు అయితే 5500లు ఫీజు చెల్లించా లని సూచించారు. విద్యార్థులకు హాస్టల్ సౌక ర్యం కూడా ఉందన్నారు. మరిన్ని వివరాలకు 9505504213/9000389029/ 98665 05119 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
రెడ్డెమ్మతల్లికి
కాసులహారం బహూకరణ
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయానికి భక్తులు బంగారు కాసుల హారాన్ని బహూకరించారు. శనివారం రాజంపేటకు చెందిన రెడ్డివరప్రసాద్, ఆయన కుమారుడు మనోజ్‌కుమార్‌లు రూ. 2లక్షలు విలువ చేసే బంగారు కాసుల హారాన్ని అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఈసందర్బంగా దాతలకు అర్చకులు, సిబ్బంది ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రత్యేకపూజలు, అభిషేకాలు చేయించారు. అమ్మవారి శేషవస్త్రంతో వారిని సత్కరించారు. అనంతరం దాతలు బంగారు కాసుల హారాన్ని ఆలయ ఈవో మంజులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ఈవో ధన్యవాదాలు తెలియజేశారు.
ఏఐతో పల్లెల్లో ప్రగతి బాటలు
కురబలకోట: గ్రామీణ ప్రాంతాల సాధికారిత కల్పనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) విప్లవాత్మక పాత్ర పోషిస్తోందని తిరుపతి శ్రీ సిటీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసిస్టెఽంట్ ప్రొఫెసర్ బుల్లా రాజేష్ అన్నారు. అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో గ్రామీణ సమాజాల సాధికారత కల్పనలో ఏఐ పరివర్తన పాత్రపై మూడు రోజుల పాటు జాతీయ సెమినార్ నిర్వహించారు. శనివారం ముఖ్య అతిధిగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌళిక సదుపాయాల అభివృద్ధి వరకు ఏఐ ఉపయోగాలు ఎంతగానో దోహదం చేస్తున్నాయన్నారు. స్మార్ట్ అగ్రికల్చర్‌తో పాటు గ్లోబల్ మార్కెటింగ్ రానుందన్నారు. పలమనేరు మధర్ ధెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్, హెచ్‌ఓడీ డాక్టర్ ప్రభుకుమార్ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ అంతరాన్ని ఏఐ తగ్గిస్తోందన్నారు.
స్కిల్‌డెవలప్‌మెంట్‌తో ఉపాధి అవకాశాలు
రాజంపేట: నేటి పోటీ ప్రపంచంలో స్కిల్ డెవలప్‌మెంట్‌తో ఉపాధి అవకాశాలు అధికంగా వస్తాయని ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి అన్నారు. అన్నమాచార్య పీజీ కాలేజీ ఆఫ్ కంప్యూటర్ స్టడీస్‌లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు సీజిర్ జ్ఞానామృతధార స్కీం ద్వారా అడ్వాన్స్ ఏఐ ప్రోగ్రామింగ్ టూల్స్ అనే అంశానికి సంబంధించి సర్టిఫికెట్ కోర్సుపై ఉచితశిక్షణ ఇచ్చి, సరిఫికెట్స్‌ను అందచేసే కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు ఆధునిక పరిజ్ఞానం,మెలకవల గురించి తెలుసుకోవాల్సిన ఆవశకత్య ఉందన్నారు. కార్యక్రమంలో అన్నమాచార్య యూనివర్సిటీ వీసీ సాయిబాబారెడ్డి, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ .డీజె సమతానాయుడు. ఎంబీఏ విభాగాధిపతి నవనీత,ఎంసీఏ .సీ.మదన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా కోర్సులో రాజంపేట ప్రభుత్వ డిగ్రీ విద్యార్థి షేక్ అస్మాత్ ప్రథమ బహుమతి, వైష్ణవీ డిగ్రీ కళాశాల విద్యార్థి షేక్.ఆశ్రీయ, ద్వితీయ బహుమతి, వెంకటసుధీర్ తృతీయ బహుమతి అందుకున్నారు.

5న పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు

5న పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు