ఇది ‘కోతల సుఖీభవ’ | - | Sakshi
Sakshi News home page

ఇది ‘కోతల సుఖీభవ’

Aug 3 2025 3:12 AM | Updated on Aug 3 2025 3:12 AM

ఇది ‘కోతల సుఖీభవ’

ఇది ‘కోతల సుఖీభవ’

రాయచోటి: కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తోంది అన్నదాత సుఖీభవ కాదని, కోతల సుఖీభవ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. శనివారంరాయచోటిలో పత్రికలకు అందజేసిన ప్రకటనలో అన్నదాత సుభీభవ నిధుల విడుదలపై స్పందించారు. రెక్కాడితే డొక్కాడని రైతులను మోసం చేయడం అన్యామన్నారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో క్రమం తప్పకుండా అన్నదాతసుఖీభవ (రైతు భరోసా) కింద కేంద్రంతో సంబంధం లేకుండా రూ. 20 వేలను ఒకేసారి అందజేస్తామని చెప్పారన్నారు. గత ఏడాది 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ అయిపోతున్న తరుణంలో తూతూ మంత్రంగా నేడు రూ. 5 వేలను రైతుల ఖాతాలలో వేస్తూ ఆర్భాటం చేస్తున్నారన్నారు. అది కూడా గత జగన్‌ ప్రభుత్వంలో ఇస్తున్న లబ్ధిదారుల కంటే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది రైతులకు తక్కువగా ఇస్తున్నారన్నారు. రైతులపై కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం, విలువ ఉన్నా వారు చెప్పిన మేరకు ఇప్పుడు ఇస్తున్న రూ. 5 వేలతోపాటు బాకీపడ్డ రూ. 35 వేలను వెంటనే వడ్డీతో సహా రైతుల ఖాతాలలో జమ చేయాలని డిమాండ్‌ చేశారు.

● ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వ్యవసాయానికి దన్నుగా ఉండేందుకు తన మేనిఫెస్టోలో పెట్టుబడి నిధి కింద 4 సంవత్సరాలకు ఏటా ప్రతి రైతుకు రూ. 12500లు చొప్పున రూ.50 వేలు అందిస్తామని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత రైతు సంక్షేమం దృష్ట్యా రూ.12500ను, రూ.13500లు చేసి ఐదేళ్లపాటు అందించేందుకు నిర్ణయించి ఏటా రూ. 13500లు చొప్పున ఐదేళ్లకు రూ. 67500ను అందించి రైతులపై తన చిత్తశుద్ధిని వైఎస్‌ జగన్‌ చాటుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 20వేలు ఇ స్తామని చెప్పి ఒక ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి ఇప్పుడు రూ.5 వేలు ఇచ్చి రైతును మోసం చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. మామిడి రైతుల దగ్గర ఇ న్సూరెన్స్‌ కట్టించుకున్నారే కానీ ప్రభుత్వం నుంచి ఒ క్కరూపాయి కూడా రైతుకు పరిహారం ఇచ్చింది లేదన్నారు.

● విద్యార్థులను, ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో అందివ్వకుండా పేదలను, ఉద్యోగాలు, నిరుదోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను, ఆడబిడ్డ నిధి ద్వారా మహిళలకు నెలకు రూ. 1500లు అందిస్తామని చెప్పి ఇవ్వకుండా... అన్ని వర్గాలను చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా రైతుల ఉసురు తగిలితే బాగుపడే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన

కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement