
బాబు దుర్మార్గానికి పరాకాష్ట
కుట్రలు పన్ని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయించడం చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి పరాకాష్ట. చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్నాడు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబునాయుడు విష సంస్కృతికి తెరతీశాడు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం సరైనది కాదు. ఎంపీ గా ఉన్న మిథున్ రెడ్డికి మద్యం వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదు., అలాంటిది మద్యం స్కాం పేరిట అరెస్ట్ చేయడం రాజకీయ అరెస్ట్ అన్న విషయం తేటతెల్లం అవుతోంది. –ఆకేపాటి అమరనాథరెడ్డి,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు