టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలతో ఎన్ని కేసులు పెట్టుకున్నా వైఎస్సార్‌సీపీ నేత, రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలపైన తప్పుడు కేసులు పెడుతోంది. మిథున్ రెడ్డిని, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ కక్షతోనే తప్పుడు కేసులు పెట్టారు. ఆధారాలు లేని తప్పుడు కేసులు న్యాయస్థానాల ముందు నిలబడవు. – కె మహిత,
రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ
రెడ్ బుక్ రాజ్యాంగంతో అక్రమ కేసులు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి...రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోంది. యాక్టివ్ గా ఉన్న నాయకులపై ఒక పథకం ప్రకారం గోబెల్స్ ప్రచారం చేస్తూ... కట్టుకథలు అల్లుతూ తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు ప్రమాదకరం. కూటమి నాయకులు పెట్టిన తప్పుడు కేసులు కోర్టులో నిలబడేవి కావు.. వాటిని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాం. –దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
రాజకీయంగా ఎదుర్కోలేకనే..
పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ఽధైర్యం లేక తప్పుడు కేసులతో అరెస్ట్‌చేసి కూటమి ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతోంది. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను అణిచివేతకు గురి చేస్తున్నారు. నేడు అది తారాస్థాయికి చేరుకుంది. ఆవేదన వ్యక్తం చేశారు. లేని లిక్కర్ స్కాంలో ఎంపీ మిథున్ రెడ్డి పైన అక్రమ కేసు పెట్టారని, ఇది కోర్టులో చెల్లుబాటు కాదని తెలిసి పైశాచిక ఆనందం కోసం అక్రమ అరెస్టు చేశారు.న్యాయ పోరాటం చేస్తూ, కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులపై ప్రజలకు తెలియజేస్తాం. –నిస్సార్ అహ్మద్,
వైఎస్సార్‌సీపీ మదనపల్లె సమన్వయకర్త
రాజకీయ కక్షతోనే..
రాజకీయ కక్షతోనే..