
అక్రమ అరెస్టులు భయపెట్టలేవు
కూటమి ప్రభుత్వం వైయస్సార్సీపి నేత లను టార్గెట్ చేస్తూ పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులు భయపెట్టలేవు. నిగర్వి, ప్రజా సేవకుడైన మిథున్‌రెడ్డిపై లిక్కర్ స్కాం పేరుతో నిరాధారణమైన కేసులను బనాయించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్‌కుమార్ రెడ్డి పైన కూడా రాజకీయ ఆరోపణలను పరిగణలోకి తీసుకొని లక్కిరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు నమోదైంది. పోలీసులు వెంటనే రమేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని రాయచోటి నుంచి మదనపల్లికి తరలించడం రాజకీయ కక్షలో భాగమే. –శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి