గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయాలు | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయాలు

Jul 22 2025 7:33 AM | Updated on Jul 22 2025 8:12 AM

గుర్త

గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయాలు

కలకడ : గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మసీదులో మౌజన్‌గా పనిచేస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై జరిగింది. క్షతగాత్రుని కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ టౌన్‌ దిగువవీధికి చెందిన రంభూభాయ్‌గారి. షేక్‌.అబ్దుల్‌మునాఫ్‌ (80) కలకడ జామియా మసీదులో మౌజన్‌గా ఉన్నారు. ఆదివారం రాత్రి 8 గంటలకు నమాజ్‌ ముగించుకుని కలకడ సత్యవతినదిపై ఇంటికి నడిచి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతని తలకు, శరీరంపై తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుని కుమారుడు రంభూభాయ్‌గారి షేక్‌. ఇనాయతుల్లా కలకడ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో

దంపతులకు తీవ్ర గాయాలు

మదనపల్లెరూరల్‌ : రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడిన సంఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో జరిగింది. మదనపల్లె మండలం, బసినకొండకు చెందిన రాము తన భార్య భాగ్యవతితో కలిసి సొంత పనులపై కారులో పె ద్దపంజాణి మండలం, చిన్నారికుంటకు వెళ్లారు. సో మవారం తిరిగి మదనపల్లెకు వస్తుండగా మార్గమధ్యంలోని పెద్దారికుంట వద్ద ఎదురుగా వచ్చిన బొలే రో వాహనం కారును ఢీ కొంది. ప్రమాదంలో భాగ్య వతి తీవ్రంగా గాయపడగా, రాముకు స్వల్పంగా గా యాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పెద్దపంజాణి పోలీసులు కేసు విచారణ చేపడుతున్నారు.

మీ అబ్బాయి

డిజిటల్‌ అరెస్ట్‌ అయ్యాడు

వాట్సాప్‌ కాల్‌తో మోసగించే యత్నం

పోలీసులను ఆశ్రయించిన ఉద్యోగి

మదనపల్లె : మీ కుమారుడు డిజిటల్‌ అరెస్ట్‌కు గురయ్యాడు.. మాకస్టడిలో ఉన్నాడంటూ ఓ వ్యక్తి సోమవారం ఓ ఉద్యోగికి వాట్సాప్‌ కాల్‌ చేసి మోసం చేసే ప్రయత్నం చేశాడు. సంబంధిత ఉద్యోగి వెంటనే పోలీసులను ఆశ్రయించి వివరాలను వారి దృష్టికి తెచ్చారు. వివరాలు ఇవి. స్థానిక ఆడిట్‌ విభాగంలో డీఏఓగా శ్రీరాములు పని చేస్తున్నారు. ఆయన ఫోన్‌ నంబర్‌కు ఓ వ్యక్తి వాట్సాప్‌ కాల్‌ చేసి హిందీలో మాట్లాడుతూ మీరు శ్రీరాములు కదా..మీ అబ్బాయి హరీష్‌ కదా అని ప్రశ్నించాడు. దీనికి అవునని సమాధానం చెప్పడంతో మీ అబ్బాయి డిజిటల్‌ అరెస్ట్‌లో ఇరుక్కున్నాడని చెప్పడంతో ఆందోళనకు గురైన శ్రీరాములు ఎందుకిలా జరిగింది అని ప్రశ్నించగా వీడియోలను వైరల్‌ చేసిన కేసులో అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. అయితే మా బిడ్డను ఫోన్‌లో మాట్లాడించండి అని కోరడంతో పొంతన లేని సమాధానాలు చెబుతూ డైవర్ట్‌ చేసే ప్రయత్నం చేయగా తర్వాత ఫోన్‌ కాల్‌ కట్‌ చేశారు. తర్వాత బెంగళూరులో పని చేస్తున్న హరీష్‌కు ఫోన్‌ చేయగా తాను ఊటీలో ఉన్నానని, ఫోన్‌ కాల్‌ మోసమని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం మదనపల్లె వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో వచ్చిన ఫోన్‌కాల్‌ వివరాలను తెలియజేశారు.

రాజంపేటలో మున్సిపల్‌

కార్మికుల భిక్షాటన

రాజంపేట : తమ సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్‌ కార్మికులు సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద భిక్షాటన చేసి నిరసనన తెలిపారు. మున్సిపల్‌ కార్మికుల నిరసన ఆరవ రోజుకు చేరుకుంది. వారు మాట్లాడుతూ ప్రాణాలు లెక్క చేయకుండా డ్రైనేజీ కాలువలో పనిచేస్తున్నామని, టీడీపీ ప్రభుత్వానికి తమపట్ల మానవత్వం కూడా లేదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నేత చిట్వేలి రవికుమార్‌, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

టీకాలతో చర్మవ్యాధుల నివారణ

కలకడ : పశువులలో వ్యాప్తి చెందే చర్యవ్యాధుల నివారణకు అందించే ఉచిత టీకాలను పాడిపశువుల రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు సంవర్థకశాఖ ఉపసంచాలకుడు డాక్టర్‌ మాలకొండయ్య పేర్కొన్నారు. సోమవారం మండలంలోని గంగాపురం పంచాయతీ కత్తివారిపల్లెలో చర్మవ్యాధి టీకాల శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాధి వచ్చిన ఆవులు, దూడలకు ఒంటిమీద బొబ్బలు రావడం, తీవ్ర జ్వరంతో బాధపడుతాయన్నారు. ఆవులలో పాల దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని తెలిపారు. ఈ వ్యాధిని టీకాలతో నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకుడు క్రిష్ణయ్య, డాక్టర్‌ తేజకళ్యాణ్‌, పూర్ణిమ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయాలు   1
1/3

గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయాలు

గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయాలు   2
2/3

గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయాలు

గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయాలు   3
3/3

గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement