
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు సంబంధించిన ఫిర్యాదులపై సత్వరం స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను తెలుసుకొని సత్వరం న్యాయం చేస్తామన్నారు.
దివ్యాంగుడి దగ్గరకు....
పెద్దమండ్యం మండలం కలిచర్ల గ్రామానికి చెందిన దివ్యాంగుడు సీమలచెరువు గంగాధర్ నడవలేని పరిస్థితిలో తన సమస్యను చెప్పుకునేందుకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ అతని వద్దకే వెళ్లి సమస్యను విన్నారు. అతను ఇచ్చిన ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ చట్టపరిధిలో అతని సమస్యను పరిష్కరించాలని ములకలచెరువు సీఐను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు