
చంద్రప్రభ వాహనంపై సిద్దేశ్వరస్వామి
రాజంపేట : తాళ్లపాక ఆలయాల బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి సిద్దేశ్వరస్వామి చంద్రప్రభ వాహనంపై, అలాగే హంస వాహనంపై చెన్నకేశవస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ ఆలయ సంప్రదాయాల ప్రకారం తాళ్లపాక పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. అంతకుముందు ఉదయం చెన్నకేశవస్వామి, సిద్దేశ్వరస్వామికి ఘనంగా పల్లకీ సేవ నిర్వహించారు. అలాగే శివ, కేశవ ఉత్సవ మూర్తులకు తిరుమంజన సేవ చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈఓ ప్రశాంతి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్ బాలాజీ, సర్పంచ్ గౌరీశంకర్, గ్రామస్తులు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.