
పారదర్శకంగా డ్వాక్రా రుణాల పంపిణీ
మదనపల్లె రూరల్ : స్వయం సహాయక సంఘాల సభ్యులకు పారదర్శకంగా రుణాలు పంపిణీ చేయాలని డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాలకు సంబంధించి ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్స్, బ్యాంకర్లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలలో ఉన్న సభ్యులందరితో బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు. వెలుగు సిబ్బంది క్షేత్రస్థాయిలో డ్వాక్రా సభ్యుల ఆర్థిక అవసరాలను గుర్తించి తదనుగుణంగా ఎంసీపీలు తయారుచేయాలన్నారు. అర్హులకు సంబంధించిన ఎంసీపీ(మైక్రో క్రెడిట్ ప్లాన్)ను బ్యాంకుకు పంపి రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు. ఎస్‌హెచ్‌జీ సమావేశాలను, వీఓఏల ద్వారా జియోట్యాగింగ్ పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం స్టాఫ్ ప్రసాదరెడ్డి, లక్ష్మి, వెంకటరమణ, కిజర్‌అహ్మద్, వేణుమాధవ్, ఏపీఎం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ