
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కురబలకోట: మండలంలోని శిద్దారెడ్డిగారిపల్లెకు చెందిన శివశంకర్ (45) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉదయం ఇంటిలో పాలు తాగిన తర్వాత మృతి చెందాడు. మృతదేహానికి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ తెలిపారు. మృతికి కారణం పోస్టుమార్టంలో వెల్లడి కావాల్సి ఉందన్నారు.
యువకుడి ఆత్మహత్య
నందలూరు : మండలంలోని మదనమోహనపురం గ్రామ పంచాయతీ వెంకటాద్రిపురం ఎస్టీ కాలనీకి చెందిన బొమ్మల నారాయణ (25) అనే యువకుడు కుటుంబ కలహాలతో ఆదివారం విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి వివరాల మేరకు బొమ్మల నారాయణ కడప నగరంలో ఇటుకల బట్టీలో పనిచేసేవాడు. మృతునికి రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మునెమ్మతో వివాహం జరిగింది. మృతుడు మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య మందలించడంతో మనస్థాపానికి గురై విషద్రావణం తాగాడు. ఈ విషయం గమనించిన భార్య బంధువుల సాయంతో రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ నారాయణ అదేరోజు మృతి చెందాడు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైతు ఆత్మహత్యాయత్నం
కురబలకోట: మండలంలోని బండపల్లెకు చెందిన రైతు చంద్రశేఖర్ రెడ్డి (28) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు..బండపల్లెకు చెందిన చంద్రశేఖర్ రెడ్డితో రక్త సంబంధీకులు భూ తగాదా విషయమై ఘర్షణ పడ్డారు. దీంతో మనస్తానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి పురుగుల మందు తాగినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. బాధ్యులపై కేసు నమోదు చేశామన్నారు.
పటిష్టమైనది భారతి సిమెంట్
ఓబులవారిపల్లె : ఇతర కంపెనీల కంటే భారతి సిమెంట్ నాణ్యమైనది, పటిష్టమైనదని భారతి సిమెంట్ టెక్నికల్ ఇంజినీర్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని శ్రీమాతా ఏజెన్సీలో భారతి సిమెంట్ వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోబోటిక్ టెక్నాలజీతో అల్ట్రా సాఫ్ట్ నాణ్యత రోబోటిక్స్ ప్రయోగశాల, జర్మన్ టెక్నాలజీ భారతి సిమెంట్ ప్రత్యేకతలని తెలిపారు. అనంతరం 40 మంది మేసీ్త్రలకు లక్ష రూపాయల ఉచిత బీమా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంట్ మార్కెటింగ్ అధికారి రమణారెడ్డి, డీలర్ మహేంద్ర రెడ్డి, మేసీ్త్రలు పాల్గొన్నారు.
గాయపడిన యువకుడి మృతి
రైల్వేకోడూరు అర్బన్: సైకిల్ తొక్కుతూ కిందపడి గాయపడిన యువకుడు మృతి చెందాడు. రైల్వేకోడూరు మండలం రాఘవరాజుపురం పంచాయతీ, రాజీవ్ గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న ఆదెమ్మ, వెంకటయ్యల మనవడు ఇడిగంటి ఈశ్వరయ్య (17) సైకిల్‌పై నుంచి కిందపడ్డాడు. ఐదు రోజుల తరువాత మృతి చెందాడు. మృతుడికి తల్లిదండ్రులు లేకపోవడంతో అవ్వాతాతల వద్ద ఉండేవాడు. ఒక్కగానొక్క మనవడు మృతి చెందడంతో ఆ వృద్ధులు శోకసంద్రంలో మునిగిపోయారు. అండగా ఉండాల్సిన మనవడు మృతి చెందడంతో ప్రభుత్వం ఆదుకోవాలని వృద్ధులు వేడుకుంటున్నారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి