
టీటీడీ ఈఓను కలిసిన అన్నమయ్య జన్మస్థలి వాసులు
రాజంపేట : తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి శ్యామలరావుతో పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి వాసులు భేటీ అయ్యారు. సోమవారం టీటీడీ ఏడీ బిల్డింగ్‌లోని ఈఓ చాంబరులో కలిసి తాళ్లపాక అభివృద్ధికి సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారు. వీరిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ రిటైర్డు ప్రిన్సిపాల్ ఉద్దండం సుబ్రమణ్యం, సురేష్‌రాజు, గూడూరు వీరాంజనేయరాజు, యానాదిరాజు, వెంకటసుబ్బరాజు, చెంగలరాజు, తోట శ్రీనివాసులు, బీజేపీ నేతలు పోతుగుంట రమేష్ నాయుడు ఉన్నారు. వీరి వెంట టీటీడీ బోర్డు డైరెక్టర్ భానుప్రకాశ్ రెడ్డి ఉన్నారు. తాళ్లపాక ఆర్చి, రోడ్డు వెడల్పు చేసి ప్రముఖ కవుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని, సెంట్రల్ లైటింగ్, సంగీత నృత్య కళాశాలు ఏర్పాటు చేయాలని, తాళ్లపాకలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని కోరారు.