
వైఎస్ జగన్‌తో జిల్లా నేతలు
రాయచోటి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అన్నమయ్య జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కలుసుకున్నారు. మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయకు వచ్చిన వైఎస్ జగన్‌ను కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు, జెడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి సుబ్రమణ్యంలు వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. అంతకు ముందుగా వారంతా వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇబ్బందులు పడుతున్న మామిడి రైతులు, కరువుతో అల్లాడుతున్న పరిస్థితులపై వైఎస్ జగన్‌కు వివరించారు.
ప్రేమాలయంలో అన్నదానం
రామాపురం మండల పరిధిలోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి వృద్ధులకు, ప్రజలకు అందించిన సంక్షేమం గూర్చి ఆయన వివరించారు.