
జాక్ పాట్‌లు రద్దు చేయాల్సిందే
గుర్రంకొండ : టమాటా మండీల్లో జాక్‌పాట్‌లు రద్దు చేయాల్సిందేనని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తరిగొండ నౌషాద్ అలీ అన్నారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక మార్కెట్ కమిటీ ఉప కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలొ ఆయన మాట్లాడారు. మార్కెట్ యార్డులో రెండు వారాల క్రితమే జాక్‌పాట్‌లు రద్దు చేయాల్సిందేనని వ్యాపారులను హెచ్చరించామన్నారు. అయితే ఇంతవరకు వ్యాపారులు జాక్‌పాట్ రద్దు చేయకుండా ఇంకా ఎక్కువగా తీసుకోవడం దారుణమన్నారు. రైతులను వేధిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 25 కేజీల క్రీట్‌ల స్థానంలో 15 కేజీల క్రీట్లు మార్చా లని గత సమావేశంలో తీర్మానించామన్నారు. ఆయితే గుర్రంకొండలో ఇంతవరకు వ్యాపారులు అమలు చేయలేదన్నారు. దీనికి మార్కెట్ కమిటీ కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బయ్యారెడ్డి, మహబూబ్ బాషా, నాయకులు పాల్గొన్నారు.