
పండ్ల తోటల పెంపకంపై ఆసక్తి చూపాలి
సిద్దవటం : పండ్ల తోటల పెంపకంపై రైతులు ఆసక్తి చూపిస్తే దిగుబడి, ఆదాయం పెరిగి రైతులకు లాభసాటిగా ఉంటుందని వైఎస్సార్ జిల్లా ఉపాధిహామీ విజిలెన్స్ అధికారిణి జుబేదా తెలిపారు. మండల కేంద్రమైన సిద్దవటంలోని మోడెం గంగాదేవి పొలంలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 2.30 లక్షల నిధులతో రెండు ఎకరాల పైబడి మామిడి సాగు కోసం నిధులు మంజూరు కావడంతో మంగళవారం ఆమె పొలంలో మామిడి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండ్ల తోటల పెంపకం కార్యక్రమంలో భాగంగా సిద్దవటం మండలంలోని భాకరాపేట, పొన్నవోలు, సిద్దవటం గ్రామాలకు ఉపాధి హామీ నిధులతో సాగు చేసే పంట పొలాల్లో దాదాపు 850 మొక్కలు నాటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఫణిరాజకుమారి, ఏపీఓ నరసింహులు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు పాల్గొన్నారు.