నందలూరు : నందలూరులో శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజైన మంగళవారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ సౌమ్యనాథస్వామి ఆశీనులై శ్రీరామచంద్రమూర్తి అవతారంలో భక్తులకు కనువిందు కలిగించారు. ఈ గ్రామోత్సవం నందలూరు, పేటగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మీదుగా బస్టాండ్ కూడలి వరకు కొనసాగింది. ఉదయం ఉత్సవమూర్తులకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఊరేగింపు వెంట మహిళల కోలాటం భక్తులను ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ హనుమంతప్ప, ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్, విజిలెన్స్ అధికారి శేషాచలం తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు : బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు బుధవారం ఉదయం శేషవాహనం, గ్రామోత్సవం, తిరుమంజనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు.
హనుమంత వాహనంపై సౌమ్యనాథస్వామి