
వాహనాల్లో బ్యాటరీలు, డీజిల్ చోరీ
మదనపల్లె రూరల్ : పార్కింగ్ చేసిన వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు, డీజిల్ పెద్ద మొత్తంలో చోరీ చేసిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. బాధితులు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పట్టణంలోని కదిరిరోడ్డు టిప్పుసుల్తాన్ మైదానంలో రాత్రి పెద్ద సంఖ్యలో వాహనాలను పా ర్కింగ్ చేస్తారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిలిపి ఉంచిన 30 లారీలు, మినీలారీలు, ట్రాక్టర్‌లు, టిప్పర్‌ల నుంచి బ్యాటరీల ను దోచుకెళ్లారు. వాహనాల్లో డీజిల్ చోరీ చేశారు. వాటి విలువ సుమారు రూ.2లక్షలకు పైగా ఉంటుందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బుధవారం టూటౌన్ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి వా హనాలను పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యా ప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు.