
పెట్రోలియం ట్యాంకర్ డ్రైవర్లకు అవగాహన
సిద్దవటం : అతి వేగం ప్రమాదకరమని హెచ్‌పీసీఎల్ డిపో మేనేజర్ సతీష్‌కుమార్ సూచించారు. పెట్రోలియం ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్‌లకు బుధవారం ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని భాకరాపేట సమీపంలో హిందూస్థాన్ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్ కంపెనీ నుంచి ట్యాంకర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించేటపుడు 60 కంటే వేగంతో వాహనాలు నడపరాదన్నారు. వాహనంలో ఫస్ట్ ఐడీ బాక్స్ ఉండాలని, ప్రతినెలా రెండు సార్లు వాహనం సర్వీసింగ్ చేయించాలని సూచించారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకు రావాలని, కంపెనీ నియమ నిబంధనలను పాటించాలని కోరారు. డ్రైవర్లు ప్రతి ఒక్కరూ యూనిఫాం ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెట్రోలియం ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు.