
తడి చెత్త, పొడిచెత్త వేరు చేయాలి
సుండుపల్లె : మండల పరిధిలోని అన్ని గ్రామాలను పారిశుధ్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా పంచాయతీ అధికారిణి రాధమ్మ సిబ్బందికి సూచించారు. మంగళవారం సుండుపల్లెలో పారిశుధ్య పనులను, డంపింగ్‌యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి చెత్త నుంచి సంపదను తయారు చేయాలన్నారు. వీధి పాలు లేని చోట్ల ఏర్పాటుకు, అలానే ఉన్న చోట్ల మరమ్మతు, నిర్వహణ చేపట్టాలన్నారు. బస్‌షెల్టర్‌లో ప్రయాణికులకు వసతులు కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్‌డీ సురేష్‌బాబు, పంచాయతీ సెక్రటరీ రామమోహన్, పంచాయతీ కార్యాలయ సిబ్బంది, మండల వ్యాప్తంగా వివిధ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.