వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం.. జగన్‌ స్పీచ్‌ హైలైట్స్‌ | YSRCP Key Meeting Under YS Jagan Leadership Latest News | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం.. జగన్‌ స్పీచ్‌ హైలైట్స్‌

May 27 2026 11:02 AM | Updated on May 27 2026 12:49 PM

YSRCP Key Meeting Under YS Jagan Leadership Latest News

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలపై ఆయన కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.. 

వైఎస్‌ జగన్‌ స్పీచ్‌ హైలైట్స్‌

  • చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు

  • బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అని రుజువైంది

  • జగన్‌ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని బాబు నమ్మించారు

  • మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుది

  • కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైంది
  • మూడోసారి కూడా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు
  • సూపర్‌-6, సూపర్‌-7 లేదు
  • ఆడబిడ్డ నిధికి నిధుల్లేవు
  • 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మెలకు ఏడాదికి రూ.18 వేలు లేవు
  • 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్‌ కూడా ఇవ్వలే
  • నిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారు
  • ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది
  • మావిగన్‌ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారు

వ్యాట్‌ తగ్గించుకోమంటే బీపీ ఎందుకు?

  • పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు
  • తగ్గించకపోగా.. బాదుడు మొదలుపెట్టారు
  • ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీనే కదా? ఎందుకు తగ్గించడం లేదు
  • రాష్ట్ర పన్నులతో తగ్గించుకోవచ్చు కదా చంద్రబాబూ!
  • తగ్గించమంటే బాబుకి బీపీ పెరుగుతోంది

ఇప్పటికీ హామీల అమలు లేదు

  • చంద్రబాబు కుట్ర రాజకీయాలు అందరికీ తెలుసు
  • మంచి చేశానని చెప్పుకునే స్థితిలో ఆయన లేరు
  • మేనిఫెస్టో అడ్రస్‌ కనిపించదు
  • ఏం చేయలేదు కాబట్టే డైవర్షన్‌ పాలిటిక్స్‌కు దిగారు
  • గొడ్డళ్లు కత్తులు,కటార్లంటూ కొత్త డైవర్షన్‌ తీసుకొచ్చారు
  • ప్రజలను పిచ్చోళ్లని చంద్రబాబు అనుకుంటున్నారు
  • కానీ, తెలివైన వాళ్లని గుర్తించాలి
  • వైఎస్సార్‌ పాలనలో, వైఎస్సార్‌సీపీ హయాంలోనే జనాలకు మంచి జరిగింది.. ఆ విషయం కాలర్‌ ఎగరేసి మరీ చెప్పగలం


వెన్నుపోటుకు రెండేళ్లు.. బుక్‌లెట్‌ ఆవిష్కరణ

  • చంద్రబాబువి వెన్నుపోటు కాదు.. వెన్నుపోట్లు
  • సూపర్‌సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ మోసాలను ప్రజలకు వివరించేలా వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమాలు
  • చంద్రబాబు మోసాలు, అవినీతి, దుర్మార్గాలు వివరించేలా బుక్‌లెట్‌ విడుదల
  • బుక్‌లెట్‌ విడుదల చేసిన వైఎస్‌ జగన్‌
  • చంద్రబాబు మోసాల్ని ప్రజలకు వివరిస్తూ.. మొదటి ఏడాది ర్యాలీ నిర్వహించాం: వైఎస్‌ జగన్‌
  • రెండో ఏడాది కూడా గొప్పగా ఆ కార్యక్రమాలు నిర్వహించాం: వైఎస్‌ జగన్‌
  • జూన్‌ 4 నుంచి 12 దాకా.. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహిద్దాం: వైఎస్‌ జగన్‌
  • జూన్‌ 4న.. మండల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ నిరసనలు: వైఎస్‌ జగన్‌
  • 8 లేదా 9వ తేదీన నియోజకవర్గ హెడ్‌క్వార్టర్స్‌ టౌన్‌హాల్‌లో సదస్సులు: వైఎస్‌ జగన్‌
  • 12న.. ప్రతీ నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు: వైఎస్‌ జగన్‌
  • ఎండలు, సర్‌ కార్యక్రమం, గ్రామస్థాయి పార్టీ బలోపేతం తదిరత అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ షెడ్యూల్‌: వైఎస్‌ జగన్‌
  • ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో భాగం కావాలి: వైఎస్‌ జగన్‌
  • కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా: వైఎస్‌ జగన్‌
  • ప్రజల నిరసన సెగలు చంద్రబాబుకి తగలాలి: వైఎస్‌ జగన్‌

జగన్‌ కీలక వ్యాఖ్యలు 

  • ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి
  • చంద్రబాబు కుట్ర రాజకీయాలు అందరికీ తెలుసు
  • మున్పిపల్‌ కార్పొరేషన్‌ ఉపఎన్నికల్లో ఆ కుట్రలు చూశాం
  • పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా ప్రజాస్వామ్యం ఖూనీ చేశారో చూశాం
  • అందుకే.. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
  • ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా నిలిచిందన్న నమ్మకం కలగాలి
  • ఆ నమ్మకం కలిగితేనే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు
  • చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి
  • ఎక్కడ కూడా ఏకగ్రీవం కాకూడదు.. అదే జరిగితే చాలా సీరియస్‌గా తీసుకుంటాం
  • ఏకగ్రీవం జరిగిందంటే ఇన్‌చార్జిలు ఫెయిల్‌ అయ్యారన్నమాట
  • ఇప్పటికే గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటయ్యాయి
  • వీరందరితో కలిసి సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలి
  • వైఎస్సార్‌సీపీ హయాంలో అందిన పథకాలు.. కూటమిలో ఎలా రద్దయ్యాయో ప్రజలకు వివరించాలి
  • బాబు వెన్నుపోటు పాలన గురించి ప్రతీ ఇంట చర్చ జరగాలి
  • స్థానిక సంస్థల ఎన్నికలను కచ్చితంగా సీరియస్‌గా తీసుకోవాలి


సర్‌ ప్రక్రియ గురించి.. 

  • బెంగాల్‌, తమినాడు ఎన్నికలను అంతా చూశారు
  • సర్‌ ద్వారా బెంగాల్‌, తమిళనాడులో లక్షల ఓట్లు తీసేశారు
  • మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్‌లో 45 వేలకు పైగా ఓట్లు తొలగించారు
  • ఆమె 15 వేల ఓట్ల తేడాతో ఓడారు
  • తమిళనాడులో స్టాలిన్‌ పోటీ చేసిన కొలతూర్‌లో 71 వేల ఓట్లు తొలగించారు
  • ఆయన ఓడింది 8 వేల ఓట్ల తేడాతో.. 
  • ఈ అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోండి
  • 91 లక్షల ఓట్లు బెంగాల్‌లో తొలగించారు
  • మమతా బెనర్జీ పార్టీ 31 లక్షల ఓట్ల తేడాతో ఓడారు
  • తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేశారు
  • స్టాలిన్‌ పార్టీ 17 లక్షల  ఓట్ల తేడాతో ఓడారు
  • కాబట్టి సర్‌ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి
  • ఓట్లు పెరగడం వల్ల మనం ఓడాం.. ఓట్లు తగ్గడం వల్ల వాళ్లు ఓడారు
  • కుప్పంలో కళ్లెదుటే అది కనిపించింది
  • ఏపీలో ఓట్లు హిస్టరీ అండ్‌ మిస్టరీ
  • మనం అనుకున్న నియోజకవర్గం నుంచి 50 ఓట్లు తొలగించినా చాలూ.. 
LIVE: YSRCP ముఖ్యనేతలతో వైఎస్ జగన్‌ భేటీ

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement