టీడీపీ నేతల వేధింపులు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం | YSRCP Activist Attempt To End Life Due To TDP | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల వేధింపులు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

Jun 6 2025 3:46 PM | Updated on Jun 6 2025 5:26 PM

YSRCP Activist Attempt To End Life Due To TDP

పల్నాడు  జిల్లాలో టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపులు భరించలేక లక్ష్మీ నారాయణ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

ఆత్మహత్యాయత్నం చమయంలో సెల్పీ వీడియో రిలీజ్‌ చేశాడు లక్ష్మీనారాయణ,. ఆ వీడియోలో టీడీపీ ప్రభుత్వం, పోలీసుల అరాచకాలపై మండిపడ్డారు.  ‘ ఈ పోలీసుల అరాచకాలకు చెక్‌ పెట్టాలి. వైఎస్సార్‌సీపీ అంటేనే ప్రభుత్వం పెద్దల అండతో పోలీసులు టార్చర్‌ పెడుతున్నారు. నాలాగా మరొకరు బలి కాకూడదు. నేను వైఎస్సార్‌సీపీ కార్యకర్త అయినందునే వేధిస్తున్నారు. నేనేమీ బాకీ లేకపోయినా పిడుగురాళ్లకు చెందిన టీడీపీ నాయకులు ఖలీల్‌ రామారావు, పత్తిపాటి రామారావు వంశీతో పాటు పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. 

నేనేమీ బాకీ లేకపోయినా పిడుగురాళ్ల కు చెందిన టిడిపి నాయకులు ఖలీల్ రామారావు పత్తిపాటి రామారావు వంశీలు పోలీసులు వేధిస్తున్నారు. డీఎస్సీ ఆఫీసుకు పిలిచి మరిచి వేధించారు. డీఎస్పీ ఆఫీసులో నువ్వు కమ్మవాడివా.. కమ్మవాడివైతే వైఎస్సార్‌సీపీలో ఎలా ఉంటావని దూషించారు’ అని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.

టీడీపీ నేతల వేధింపులతో YSRCP కార్యకర్త ఆత్మహత్యాయత్నం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement