వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Pays Tributes to YSR at Idupulapaya Updates | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌

Sep 2 2026 7:22 AM | Updated on Sep 2 2026 8:35 AM

YS Jagan Pays Tributes to YSR at Idupulapaya Updates

సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. బుధవారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించి అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రార్థనలకు.. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

 

వైఎస్సార్‌ వర్థంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమం జరిగింది. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆశయాలు సాధిస్తాం.. జోహార్ వైఎస్సార్ అంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు నినాదాలు చేశారు.  

 

ఇదీ చదవండి: మరపురాని మహానేత.. జల ప్రదాత వైఎస్సార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement