ఇంటి వద్దే కారు.. అయినా టోల్‌ కట్‌ 

Toll is Collected by Fastag Even if Car is at Home Dwarakathirumala - Sakshi

సాక్షి, ద్వారకాతిరుమల: ఇంట్లోనే కారు ఉన్నా ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ వసూలు చేసినట్లు ఫోన్‌కు మెస్సేజ్‌ రావడంతో ద్వారకాతిరుమలకు చెందిన ఓ కారు యజమాని తెల్లబోయాడు. వివరాలిలా ఉన్నాయి. ద్వారకాతిరుమలకు చెందిన ఒబిలిశెట్టి గంగరాజుకుమార్‌ సెల్‌ఫోన్‌కు సోమవారం ఉదయం 11.23 గంటలకు ఒక మెసేజ్‌ వచ్చింది. దీనిని పరిశీలించగా, ఏపీ 37 సీఏ 4747 నంబర్‌ గల తన రెనాల్ట్‌ స్కాలా కారుకు ప్రకాశం జిల్లాలోని మేకలవారిపల్లి టోల్‌ ప్లాజా నుంచి ఫాస్టాగ్‌ ద్వారా రూ.40 లు టోల్‌ రుసుము కట్‌ అయ్యినట్లు అందులో ఉంది. అపార్ట్‌ మెంట్‌ లో తన ఇంటి వద్దే ఉన్న కారుకు అక్కడ టోల్‌ ఎలా కట్‌ చేశారో తెలియక అయోమయంలో పడ్డాడు. కనీసం కారు రోడ్డు మీదకు వెళ్లకుండా టోల్‌ రుసుము వసూలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. 

కారు యజమానికి ఫాస్టాగ్‌ ద్వారా డబ్బులు కట్‌ అయినట్లు వచ్చిన మెసేజ్, అపార్ట్‌మెంట్‌లో ఉన్న కారు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top