దళిత రైతుల భూములపై టీడీపీ నేతల కన్ను | TDP Leaders Eye Dalit Farmers Lands In Tirupati District | Sakshi
Sakshi News home page

దళిత రైతుల భూములపై టీడీపీ నేతల కన్ను

May 23 2026 4:30 PM | Updated on May 23 2026 4:50 PM

TDP Leaders Eye Dalit Farmers Lands In Tirupati District

తిరుపతి: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కుర్ర కాలువలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దళిత రైతుల భూములపై టీడీపీ నేతలు కన్నేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కుర్ర కాలువ గ్రామంలో  దళిత రైతులు సుబ్రహ్మణ్యానికి చెందిన 3.39 ఎకరాల భూమిపై టిడిపి నేతల దౌర్జన్యం చేశారు. సొంత భూమిలో నీటి  బోరు వేసుకుంటుంటే  టిడిపి నేత మోహన్ నాయుడు అడ్డుకున్నారు. 

దౌర్జన్యంగా బోర్వెల్ లారీని వెనక్కు పంపించేశారు. దాంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వంలో దళితుల భూములకు రక్షణ లేకుండా పోయిందని బాధిత సుబ్రహ్మణ్యం  ఆరోపించారు. పంటలను కాపాడుకునేందుకు సూత్రాలు తెచ్చి బోరు వేస్తుంటే అడ్డుకున్నారని సుబ్రహ్మణ్యం భార్య ఆవేదన వ్యక్తం చేశారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement