సొంత మండలంలో.. ఎమ్మెల్యే పరిటాల సునీతకు గెలుపు కరువైంది | TDP Faces Setback in Paritala Sunita’s Home Mandal | Sakshi
Sakshi News home page

సొంత మండలంలో.. ఎమ్మెల్యే పరిటాల సునీతకు గెలుపు కరువైంది

Nov 27 2026 7:37 AM | Updated on Nov 27 2026 7:37 AM

TDP Faces Setback in Paritala Sunita’s Home Mandal

సాక్షి,శ్రీ సత్యసాయి జిల్లా: మున్సిపల్, నగర పాలక ఎన్నికల్లోనే కాదు.. పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంది. అధికార పార్టీ కీలక నేతల సొంత మండలాల్లోనూ గెలిచే పరిస్థితి లేకపోవడంతో బెదిరింపు రాజకీయాల్ని కొనసాగిస్తోంది.   

తాజాగా, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలంలో టీడీపీకి గెలుపు కరువైంది. పేరూరు మేజర్‌ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గెలుపొందారు. 10 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు మోహన్‌బాబు విజయం సాధించారు.

అయితే ఓటమి భయంతో పరిటాల సునీత రంగంలోకి దిగారు. టీడీపీ మద్దతుదారు గెలిచే వరకు రీకౌంటింగ్‌ చేయాలని ఎన్నికల అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో ఎన్నికల అధికారులు రీకౌంటింగ్‌ నిర్వహించారు. రీకౌంటింగ్‌ నిర్వహించిన ప్రతీసారి టీడీపీ మద్దతుదారుడి ఓట్లు తగ్గుతూ వస్తున్నాయి.

ఈ క్రమంలో తాము గెలిచినట్లు తేలిందని, డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు ధర్నాకు దిగారు. గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్‌ ఇవ్వక పోవడంతో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం వీరి ఆందోళన కొనసాగుతోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement