సుందర గుంటూరు | Sakshi
Sakshi News home page

సుందర గుంటూరు

Published Fri, Jan 12 2024 5:24 AM

swachh survekshan works with hundreds of crores: Guntur - Sakshi

దాళా రమేష్‌ బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఒకప్పుడు.. ఎవరైనా గుం‘టూరు’కు వెళ్లాలంటే భయపడేవారు. కారణం అక్కడి రోడ్లు. నడవడానికే భయంకరంగా ఉండేవి. చీకటిపడితే ఏ గోతిలో పడతామో తెలియదు. ముక్కు మూసుకోకుండా నగరంలో తిరగడమూ కష్టమే. గత ప్రభుత్వం అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజి పేరుతో సుమారు 120 కిలోమీటర్లు అస్తవ్యస్తంగా తవ్వేసి కొత్త ప్రభుత్వానికి అప్పగించింది.

ఛాలెంజిగా తీసుకున్న వైసీపీ ప్రభుత్వం దాని ప్రాథమిక రిపేరుకే రూ50 కోట్లు ఖర్చు చేసి ప్రజలకు ఊరట కల్పించింది. ఆ తరువాత గుంటూరు అభివృద్ధిపై దృష్టి పెట్టింది. నూతన సీసీ రోడ్లు, డ్రెయిన్‌లు వంటి మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో వందల కోట్ల రూపాయలతో 537 పనులు ప్రారంభించింది. ఐఏఎస్‌లను మున్సిపల్‌ కమిషనర్లుగా తీసుకు వచ్చి అభివృద్ధి పట్టాలు ఎక్కించింది.  

 రూ. 163 కోట్లతో పీవీకే నాయుడు మార్కెట్‌ 
నగరం నడి రోడ్డున 1.92 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన హంగులతో నగరానికే ఐకానిక్‌ బిల్డింగ్‌గా గ్రౌండ్, 8  అంతస్తులతో పీవీకే నాయుడు మార్కెట్‌ నిర్మాణానికి తుది దశలో టెండర్లు. దీని కోసం రూ.163 కోట్లు ఖర్చు.  

 ఆహ్లాదానికి పెద్దపీట 
► గాంధీపార్కు పునరుద్ధరణకు రూ.4.50 కోట్లు. 
► నగరంలో 22 పార్క్‌ల అభివృద్ధికి రూ.9 కోట్లు.  
► నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలు, రిజర్వ్‌ సైట్‌ల గుర్తింపు. 
​​​​​​​► వాటిలో ప్లే సెంటర్లు, వాకింగ్‌ ట్రాక్‌ల అభివృద్ధి. 
​​​​​​​► నగరంలోని 15 ఐలాండ్ల అభివృద్ధికి రూ.2.56 కోట్లతో అంచనాలు. ఇందులో 8 సెంటర్‌లు ఇప్పటికే అందుబాటులోకి. 
​​​​​​​► జగనన్న హరిత వనాలలో భాగంగా 42 కిలోమీటర్ల పచ్చదనానికి రూ.6.24 కోట్ల వెచ్చింపు. 
​​​​​​​► స్వచ్ఛ సర్వేక్షణ్‌ పథకంలో నగరాన్ని సుందరీకరణకు రూ.48 లక్షలు ఖర్చు. అద్భుత పనితీరుతో  జాతీయ స్థాయి ర్యాంకు కైవశం.  

పార్కుల కోసం రూ.11.5 కోట్లు
సెంట్రల్‌ డివైడర్లు  రూ. 7.64  కోట్లు
నూతన రోడ్లు, డ్రైన్లు ఏర్పాటుకు రూ. 491 కోట్లు
ఐలాండ్స్‌ అభివృద్ధి  రూ. 3.75 కోట్లు 
పీవీకే నాయుడు మార్కెట్‌ రూ. 163  కోట్లు
అర్బన్  హెల్త్‌ సెంటర్లు రూ.19.71 కోట్లు

జగనన్న కాలనీలతో కొత్త రూపు
► అర్బన్‌ పరిధిలోని పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో ఏటుకూరు, కొర్నెపాడు, పేరేచర్ల, పొత్తూరు, బుడంపాడు, దామరపల్లి, లాం ప్రాంతాల్లో 1277 ఎకరాల్లో 60 వేల ప్లాట్స్‌తో జగనన్న కాలనీలు. 

► గుంటూరు నగరంలో పేరేచర్ల, ఏటుకూరు వద్ద భారీ లేఅవుట్లు. 29,887 మందికి ఇళ్లు మంజూరు.  

► తొలి విడతగా 28 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు. అందులో ఇప్పటికే 7 వేలు పూర్తి. 

► ఈ ఏడు లే–అవుట్స్‌లో జంగిల్‌ క్లియరెన్స్‌ రూ.16.70 లక్షలు. అంతర్గత రోడ్లకు రూ.7.94 కోట్లు.  అప్రోచ్‌ రోడ్లకు రూ.16.95 లక్షలు. సీసీ కల్వర్ట్‌లకు రూ.1.48 కోట్లు. మేజర్‌ డ్రెయిన్లకు రూ.21 లక్షలు. ఎల్‌ఈడీ లైట్లకు రూ.4.80 లక్షల ఖర్చు. 

దాహం తీరింది 

  • తాగునీటి ఎద్దడి సమస్య శాశ్వత పరిష్కారానికి సంజీవయ్యనగర్‌ వద్ద ట్రాక్‌ క్రాసింగ్‌ పూర్తి చేసి ఇంటర్‌ కనెక్షన్  ఏర్పాటు. 
  • నెహ్రూనగర్‌ రిజర్వాయర్‌ నుంచి పశ్చిమ నియోజకవర్గానికి 800 డయాపైప్‌లైన్న్‌ అందుబాటులోకి. 
  • గోరంట్ల కొండ మీద రెండు వాటర్‌ ట్యాంకుల నిర్మాణానికి రూ.33 కోట్ల ఖర్చు. విలీన గ్రామాలకు ఇది ఊరట.  

అభివృద్ధి పథంలో జీజీహెచ్‌
► రూ. 5కోట్లతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో నిర్మాణ పనులు. 
​​​​​​​► రూ. 35 లక్షలతో ఎస్‌ఎన్‌సీయూ క్లినిక్‌ నిర్మాణం. 
​​​​​​​► రూ.25 కోట్లతో పెట్‌సిటీ స్కాన్, రూ.4 కోట్లతో సీటీస్కాన్‌ ఏర్పాటు. 
​​​​​​​► సర్విస్‌ బ్లాక్‌ నిర్మాణం కోసం రూ. 7.5 కోట్లు మంజూరు. 
​​​​​​​► రూ.3.5 కోట్లతో ప్రహరీ నిర్మాణం. ​​​​​​​
► రూ.40 లక్షలతో సీఆర్మ్‌ వైద్య పరికరం, రూ. 30 లక్షలతో ఏబీజీ వైద్య పరికరాలు, రూ.25 లక్షలతో ఈఎన్‌టీ మైక్రోస్కోప్, రూ. 40 లక్షలతో ఆపరేషన్‌ థియేటర్‌ లైట్లు, రూ.12 కోట్లతో లీనియర్‌ యాక్సిలేటర్‌ క్యాన్స­ర్‌ వైద్య పరికరాల కొనుగోలు. 
​​​​​​​► రూ. 40 కోట్లతో గుంటూరు వైద్య కళాశాల వసతి గృహాల్లో భవన నిర్మాణాలు. 
​​​​​​​► రూ.19.70 కోట్లతో నగరంలో 16 వైఎస్సార్‌ అర్బన్  హెల్త్‌ సెంటర్ల నిర్మాణం.   

రోడ్లకు చికిత్స 
నగరంలోని ప్రధాన రోడ్లతోపాటు దెబ్బతిన్న అంతర్గత రోడ్లను పునరుద్ధరించుకుంటూ వస్తున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో రూ.491.79 కోట్లతో తూర్పులో 792, పశ్చిమలో 918, ప్రత్తిపాడు నియోజకవర్గంలో 150 అభివృద్ధి పనులు చేశారు. నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించేందుకు తొలివిడతగా నందివెలుగు రోడ్డు, కుగ్లర్‌ హాస్పిటల్‌ రోడ్, పెదపలకలూరు రోడ్, ఏటీ అగ్రహారం, డొంక రోడ్లను విస్తరించారు.  

సమగ్రాభివృద్ధి దిశగా... 
గుంటూరు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాం. రోడ్లు, డ్రెయిన్లు, డివైడర్లు, పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. నగరంలోకి రాగానే ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కూడా జాతీయస్థాయిలో ర్యాంకు తీసుకురాగలిగాం. నగరాన్ని హరిత నగరంగా, శుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం.  – కీర్తి చేకూరి, కమిషనర్, నగరపాలక సంస్థ, గుంటూరు 

పార్కుల అభివృద్ధి చాలా బాగుంది 
గుంటూరు నగరంలో పార్కులను అభివృద్ధి చేయడం ఎంతో బాగుంది. గాంధీ పార్క్‌ను కూడా ఆధునికీకరించి పునః ప్రారంభించడంతో పిల్లలను పార్కుకు తీసుకు వెళ్తున్నాను. పార్కులో చాలా రకాల ఆట వస్తువులు పిల్లలు ఆడుకునేందుకు అనువుగా ఉన్నాయి.  – పూరి్ణమ (గృహిణి), కొరిటెపాడు  

అభివృద్ధిని చూస్తున్నాం 
ప్రస్తుతం గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. రోడ్లు లేని చోట రోడ్లు వేస్తున్నారు. డివైడర్లలో మొక్కలు ఏర్పాటుచేసి పచ్చదనం సమకూర్చడం బా గుంది. గతంలో ఎప్పుడూ ఇటువంటి అభివృద్ధి చూడలేదు.  – సిహెచ్‌. విజయ్‌కుమార్‌(పాత గుంటూరు)  

యూజీడీ పేరుతో తవ్వేశారు.. 
నల్లపాడు రైల్వేస్టేషన్ కి వెళ్లే రోడ్డు ఏళ్ల తరబడి గోతులతో ఉండేది. యూజీడీ పేరుతో రోడ్డు అంతా తవ్వి కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా చేస్తే ప్రస్తుతం తారు రోడ్డు వేయడంతో ఇబ్బంది లేకుండా ఉంది. ఎప్పటి నుండో ఉన్న సమస్య పరిష్కారం చేసిన అధికారులకు, నాయకులకు ధన్యవాదాలు. –గేరా మణెమ్మ, శ్యామలానగర్‌ ఎక్స్‌టెన్షన్

Advertisement
 

తప్పక చదవండి

Advertisement