జాతీయ స్థాయిలో మెరిసిన తిరుపతి

Swachh Survekshan 2021: Tirupati As Country 4th Water Plus City - Sakshi

వాటర్‌ ప్లస్‌ విభాగంలో నాల్గో నగరంగా గుర్తింపు

తిరుపతి తుడా (చిత్తూరు జిల్లా): స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో తిరుపతి నగరం మరోసారి జాతీయ స్థాయిలో మెరిసింది. న్యూఢిల్లీలో ఆదివారం వాటర్‌ప్లస్‌ సర్టిఫికేషన్‌ పొందిన నగరాల జాబితాను ప్రకటించారు. ఈ పోటీల్లో తిరుపతి నగరం వాటర్‌ ప్లస్‌ విభాగంలో జాతీయ స్థాయిలో నాల్గో నగరంగా నిలిచింది. ఇండోర్, సూరత్, నార్త్‌ ఢిల్లీ నగరాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. అలాగే సౌత్‌ ఇండియా నుంచి ఎంపికైన ఏకైక నగరంగా తిరుపతి గుర్తింపు పొందింది. రేణిగుంట సమీపంలోని తూకివాకం గ్రీన్‌ సిటీలో ఎస్‌టీపీ ప్లాంట్‌ను కార్పొరేషన్‌ నిర్వహిస్తోంది. పలు విధాలుగా నీటిని శుద్ధిచేసి ఆపై వినియోగంలోకి తీసుకొస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

ఓడీఎఫ్‌ ప్లస్, ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్లస్‌ విభాగంలో ప్రతిభ చాటి తిరుపతి నగరం ఇప్పటికే త్రీ స్టార్‌ రేటింగ్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌లో పోటీ పడాలంటే తప్పనిసరి వాటర్‌ ప్లస్‌ సర్టిఫికేషన్‌ కలిగి ఉండాలి. వచ్చే పోటీల్లో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌కు పోటీపడేందుకు తిరుపతి నగరం సిద్ధంగా ఉందని కమిషనర్‌ పీఎస్‌ గిరీష సంతోషం వ్యక్తం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top