టీటీడీపై తప్పుడు ప్రచారం చేసే చానల్‌పై పరువు నష్టం దావా | Subramanian Swamy Comments On False propaganda on TTD | Sakshi
Sakshi News home page

టీటీడీపై తప్పుడు ప్రచారం చేసే చానల్‌పై పరువు నష్టం దావా

Mar 6 2021 4:37 AM | Updated on Mar 6 2021 9:40 AM

Subramanian Swamy Comments On False propaganda on TTD - Sakshi

సాక్షి, అమరావతి: శ్రీవేంకటేశ్వరస్వామి వారి భక్తులందరికీ విసుగు పుట్టించేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని క్రైస్తవీకరిస్తున్నారంటూ ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని బీజీపీ కార్యవర్గ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. అలా తప్పుడు ప్రచారం చేసే వాటిలో ఒక చానల్‌పై మొదటగా పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్టు తెలిపారు.

ఈ మేరకు సుబ్రమణ్య స్వామి శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ ఒక వర్గం మీడియా టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తుండడం శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుడిగా నాకు విసుగు తెప్పించింది. చంద్రబాబు ఆర్థిక సాయం అందజేసే మీడియా సంస్థలే ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయి’ అని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement