నాలుగో రోజుకు మత్స్యకారుల దీక్షలు | Strikes For Vishaka Executive Capital | Sakshi
Sakshi News home page

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం మత్స్యకారుల దీక్షలు

Sep 21 2020 6:43 PM | Updated on Sep 21 2020 6:52 PM

Strikes For Vishaka Executive Capital  - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, విశాఖపట్నం‌: విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలంటూ దీక్షలు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మత్స్యకార యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నాలుగో రోజు కూడా దీక్షలు కొనసాగాయి. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేసినట్లయితే ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గుతాయని దీక్షాలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. మత్స్యకార నాయకుడు జానకిరామ్ చేపట్టిన ఈ దీక్షకు వైఎస్సార్‌సీపీ కన్వీనర్ కే. రాజు మద్దతు పలికారు.  చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఖాయమని కే. రాజు ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement