బాబాయి గారూ! ఆ చర్యలకు మీరు సిగ్గుపడడం లేదా?

Sanchaita Gajapathi Raju Comments On Ashok Gajapathi Raju - Sakshi

సాక్షి, విజయనగరం : టీడీపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుపై మాన్సాస్‌ ట్రస్ట్ మాజీ చైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనపై మండిపడ్డారు. ‘‘అశోక్‌ బాబాయి గారూ.. మీ అన్నగారి పుట్టినరోజున ప్రభుత్వ ఉద్యోగి అయిన మాన్సాస్‌ ఈవోపైకి సిబ్బందిని రెచ్చగొట్టి పంపారు. రక్షణ కోసం మాన్సాస్‌ ఈవో పరుగులు తీయాల్సిన పరిస్థితి.

ఇలాంటి చర్యలకు మీరు సిగ్గుపడడం లేదా?. సిబ్బందిని తప్పుదోవ పట్టించి, రెచ్చగొట్టి ఈవో మీదకు పంపారు. మీ రాజకీయ చదరంగానికి మాన్సాస్‌ విద్యాసంస్థలను వేదికగా చేసుకోకండి. తాతగారు పీవీజీ రాజుగారు, నాన్నగారు ఆనందగజపతిగారు.. మాన్సాస్‌ సంస్థలను గొప్పగా తీర్చిదిద్దారు. ఆ వారసత్వాన్ని మీరు ధ్వంసం చేస్తున్నారు’’అని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top