అక్టోబరు 25 నాటికి పునాది పడాల్సిందే..! | Sakshi Special Interview With District Housing Corporation Director | Sakshi
Sakshi News home page

Jagananna Colonies: అక్టోబరు 25 నాటికి పునాది పడాల్సిందే..!

Sep 3 2021 9:04 AM | Updated on Sep 3 2021 10:37 AM

Sakshi Special Interview With District Housing Corporation Director

హౌసింగ్‌ పీడీ గణపతి

సాక్షి,శ్రీకాకుళం(కాశీబుగ్గ): అక్టోబరు 25 నాటికి వైఎస్సార్‌ జగనన్న కాలనీలలో పునాదులు కట్టే ప్రక్రియ పూర్తి చేయాల్సిందేనని జిల్లా హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎన్‌.గణపతి స్పష్టం చేశారు. జగనన్న కాలనీల ప్రస్తుత పరిస్థితి, గ్రౌండింగ్, నిర్మాణ సామగ్రి తదితర వివరాలను గురువారం ‘సాక్షి’కి ప్రత్యేకంగా వెల్లడించారు.   

ప్రశ్న: జగనన్న కాలనీలు ఎన్ని మంజూరయ్యాయి? ఎంతమంది లబ్ధిదారులు? 
జవాబు: మొత్తం 866 జగనన్న కాలనీలు సిద్ధం చేశాం. అందులో స్థల సమస్యతో 13 మాత్రమే పెండింగ్‌లో ఉండగా, 91,138 మందికి స్థలాలు కేటాయించాం. 

ప్ర: నిర్మాణదారులకు సాయమెలా..? 
: దశలవారీగా బిల్లులు చెల్లిస్తున్నాం. రూరల్‌ పరిధిలో 1.5 సెంట్లు, అర్బన్‌లో సెంటు స్థలం పట్టా అందించాం. కాలువ, రోడ్లు, విద్యుత్‌ సౌకర్యంతో పాటు ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుని ఖాతాలో రూ.1,80,000 జమ చేస్తున్నాం. వీరు కావాలనుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోదాముల్లో సబ్సిడీపై సిమెంట్, ఐరన్‌ పొందవ చ్చు. ఇసుక ఉచితమే.

ప్ర: రాయితీ సామగ్రి పొందడమెలా? 
: సచివాలయం పరిధిలో ఎమినిటి కార్యదర్శి వద్ద ఇసుక, సిమెంట్, ఐర న్‌ బుక్‌ చేసుకోవాలి. ఇసుకను ఉచి తంగానే ఇస్తారు. సిమెంట్‌ బస్తాను సబ్సిడీపై రూ.240కు అందిస్తున్నారు. అది కూడా ఇంటి బిల్లులోనే మినహాయించుకుంటా రు.  ఒక్కో లబ్ధిదారుకు 90 బస్తాలు ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి అర్బన్, రూరల్‌ చొప్పున రెండు సిమెంట్‌ గోదాములు ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా 36 ఇసుక డిపోలను ఏర్పాటు చేశాం. 877 చోట్ల లేఅవుట్లకు విద్యు త్‌ కనెక్షన్లు ఏర్పాటు చేశాం. 371 బోర్లు  వేశాం. 

ప్ర: గ్రౌండింగ్‌ ఎంతవరకు వచ్చింది? 
జ: ఇప్పటివరకూ 70 శాతం గ్రౌండింగ్, 90 శాతం మ్యాపింగ్, 83 శాతం జియోటాగింగ్‌ పూర్తయ్యింది. పునాదులు కట్టిన వారికి ఇప్పటికే రూ.53 వేలు నగదు, రెండు ట్రాక్టర్ల ఉచిత ఇసుక అందించాం. 

ప్ర: రుణ సదుపాయం కల్పిస్తున్నారా..? 
జ: దరఖాస్తు చేసుకున్న మొత్తం లబ్ధిదారుల్లో 76,651 మంది రుణాలు పొందడానికి అర్హులు. వీరికి రానున్న రోజుల్లో రుణాలు మంజూరు చేస్తాం.

ప్ర: ఎప్పటిలోగా పునాదులు వేయాలి..? 
: అక్టోబరు 25 నాటికి పునాదుల నిర్మాణం పూర్తిచేయాలి. సెప్టెంబరు 15 నాటికి 35 శాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ ఇప్పటికే లక్ష్యం నిర్దేశించారు. లబ్ధిదారు ఇల్లు కట్టనని తెలియజేస్తే వారి స్థానంలో కొత్త లబ్ధిదారునికి అందించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ 90 రోజుల్లో ఇంటి స్థలం, ఇల్లు మంజూరు పథకం ఉంది. దానిని యాక్టివ్‌ చేస్తాం. అదే విధంగా ఆప్షన్‌–3లో జిల్లాలో 703 మంది దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో నిర్మాణ పనులు మొదలుపెడతాం.

చదవండి: ఏపీ: నేడు రీస్టార్ట్‌–2 ప్యాకేజీ విడుదల   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement