సాక్షి,తాడేపల్లి : సోషల్ మీడియా విభాగం కేవలం పోస్టులు పెట్టే వ్యవస్థ కాదు.. పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తిగా మారాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
సోమవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సోషల్ మీడియా విభాగం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘గ్రామస్థాయి వరకు నెట్‌వర్క్‌ను విస్తరించి, లోకల్ కంటెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎన్నికల్లో ప్రతి ఘటనను విజువల్ ఎవిడెన్స్‌గా రికార్డు చేయాలి. సోషల్ మీడియా పోస్టుల్లో భాష హుందాగా, విషయం బలంగా ఉండాలి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సోషల్ మీడియా విభాగం అత్యంత కీలకంగా వ్యవహరించాలి. కంటెంట్ క్రియేట్ చేయడం ఒక్కటే కాదు, పార్టీ నుంచి వచ్చే మెసేజ్‌లను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సోషల్ మీడియా పార్టీ వ్యవస్థకు శరీరంలో రక్త ప్రసరణలాంటిది. ప్రజా భిప్రాయాన్ని చేరుకోవడంలో, పార్టీ వాదనను ప్రజల ముందు ఉంచడంలో దాని పాత్ర అత్యంత కీలకం. సోషల్ మీడియా విభాగం అన్ని అనుబంధ విభాగాలతో అనుసంధానమై పనిచేయాలి. గ్రామం, మండలం, నియోజకవర్గం వారీగా నెట్‌వర్క్ పెంచాలి.లోకల్ కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి : ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ రిజర్వేషన్లు ఖరారు


