విజయవాడ రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి | YSRCP Chief YS Jagan shock over Vijayawada Road Accident | Sakshi
Sakshi News home page

విజయవాడ రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Oct 12 2026 8:34 PM | Updated on Oct 12 2026 8:47 PM

YSRCP Chief YS Jagan shock over Vijayawada Road Accident

తాడేపల్లి : విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కారు ప్రమాదంలో నలుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేసిన వైఎస్‌ జగన్‌.. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు మృతుల కుటుంబాలకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానన్నారు.

కాగా, విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఘోర విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ కారు (ఈవీ) రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన మరుక్షణమే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే వాహనం పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

ఇదీ చదవండి: విజయవాడ బైపాస్‌లో ఘోర ప్రమాదం

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement