వైఎస్‌ జగన్‌కు రాపాక శుభాకాంక్షలు

Rapaka Vara Prasada Wishes To YS Jagan On Padayatra - Sakshi

కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పధకాలు: రాపాక

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసి నేటికి (శుక్రవారం) మూడు సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాసంకల్ప యాత్రం ఓ చరిత్రను లిఖించిందని అన్నారు. వైఎస్‌ జగన్‌ చేసిన పాదయాత్ర ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో​ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఆయన వెంట వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారని ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా ఆయనకు మద్దతుగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. 17 నెలల పాలనలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నాయని, బ్యాంకుల ద్వారా ప్రత్యేక మైన నిధులు మంజూరు చేసి ఏప్రిల్ నాటికి బాగుచేస్తానని ముఖ్యమంత్రి హమీ ఇచ్చారని తెలిపారు. 

ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు
‘గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో రోడ్లు కూడా వేసిన పరిస్థితి లేదు. అటువంటి రోడ్లను కూడా బాగు చెయ్యటానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారు. అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా ప్రభుత్వ పాలన‌ ఉంది. పాదయాత్ర ఇచ్చిన హమీ మేరకు 56బీసీ కులాలకు కార్పొరేషన్లు ఎర్పాటు చేశారు. దేశ చరిత్రలో ఎవరు చేయని సాహసం సీఎం జగన్‌ చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో కరోనా పేరుతో ఎన్నికలను నిలుపుదల చేశారు. వాస్తవానికి అప్పుడు కరోనా కేసులు అంతగా లేవు. ఇప్పుడు వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించాలి అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేవలం తెలుగుదేశం పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి గ్రామంలో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించడం సరైనది కాదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యహారం పై ప్రజల నుండి పూర్తి వ్యతికత ఉంటుంది. స్దానిక సంస్థలు ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే పరిస్థితి లేదు’ అని అన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top