అయ్యో పాపం..

Provide Assistance To Children Who Have Lost Their Parents - Sakshi

మూడు నెలల క్రితం తల్లి.. ఇప్పుడు తండ్రి మృతి 

అనాథలుగా మారిన చిన్నారులు

నౌపడలో విషాధకర సంఘటన

దాతలు ఆదుకోవాలని వేడుకోలు 

సంతబొమ్మాళి: పసి వయస్సులోనే బండెడు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. తోటి వారందరూ ఆడుతూపాడుతూ గడుపుతుంటే విధి వారి పాలిట శాపంగా మారింది. తల్లిదండ్రులు అకాలంగా మృతి చెందడంతో ఈ బాలికల ఆవేదన పలువురిని కలిచి వేసింది. మండలంలోని నౌపడ గ్రామానికి చెందిన కొంచాడ యుగంధర్‌కు ఉషారాణితో 2007లో వివాహమైంది. వీరికి స్వాతి, పల్లవి అనే కుమార్తెలున్నారు. టీ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే విధి మరోలా తలచింది.

యుగంధర్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో భార్య ఉషారాణి సహాయంతో టీ దుకాణాన్ని నడుపుతూ కుటుంబాన్ని కొంత కాలం పోషించుకుంటూ వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 26న ఉషారాణికి (36) గుండెపోటు రావడంతో మృతి చెందింది. కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకొనే స్థోమత లేకపోవడంతో యుగంధర్‌ (41) ఆదివారం మృతి చెందాడు. ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. పెద్దకుమార్తె స్వాతి 9వ తరగతి, చిన్న కుమార్తె పల్లవి 7వ తరగతి నౌపడ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. అనాథలైన వీరిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top